ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయల్దేరారు. బెస్ట్ ప్రాక్టీసెస్, కామన్ ప్రాక్టీసెస్ పై కేంద్రం నియమించిన గవర్నర్ల కమిటీకి ఆయన ఛైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీ ఇటీవలే గవర్నర్ నరసింహన్ కు నివేదికను సమర్పించింది. గవర్నర్ ఆ నివేదికను మంగళవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు సమర్పిస్తారు. తదనంతరం ఆయన ఢిల్లీలో జరిగే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు.
గవర్నర్ తన పర్యటనలో మోదీ, రాజ్ నాథ్ సింగ్ లతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని భేటీలో ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, జఠిలమైన సమస్యలు చర్చకు రానున్నాయి. సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందించడంతో సమస్యలు ఎలా పరిష్కారమౌతాయో గవర్నర్ ప్రధానికి వివరించే అవకాశం ఉంది. హైకోర్టు విభజన ప్రక్రియ కూడా ఈ పర్యటనలో చర్చకు రావొచ్చని సమాచారం.