ఐక్యరాజసమితికి భారతీయ అంబాసిడర్‌గా పనిచేస్తోన్న సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ఖాతాను ఎవరో ఆగంతకులు హ్యాక్ చేశారు. ఆ అకౌంట్‌ను హ్యాక్ చేశాక, అదే ఖాతాలో పాకిస్తాన్ జెండాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఫోటోని కూడా పోస్టు చేశారు. ఆదివారం ఉదయమే ఆ ఘటన చోటు చేసుకుంది. నిజం చెప్పాలంటే భారతీయ అధికారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను గానీ.. వెబ్సైట్లను గానీ హ్యాక్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2016లో దాదాపు 199 భారత ప్రభుత్వ వెబ్సైట్లను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు.
ఆ తర్వాత అడపాదడపా ఈ హ్యాకింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే భారత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ కాస్త బలహీనంగా ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయన్నది పలువురి అభిప్రాయం. తాజాగా జరిగిన హ్యాకింగ్ ఘటనలో మాత్రం భారత సైబర్ సెక్యూరిటీ టీమ్ వేగంగానే స్పందించింది. గంటల వ్యవధిలో హ్యాకింగ్‌కు గురైన అంబాసిడర్ ఖాతాను యథాస్థానానికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో సహకరించిన ట్విటర్ ఇండియా అధికారులకు కూడా అంబాసిడర్ ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రతిఘటించాలంటే..ఈ హ్యాకింగ్ కంటే మరేదైనా మార్గాన్ని ఎంచుకోమని ఆయన ట్విట్టర్ ముఖంగనే తెలిపారు.
I’m back.
It will take more than a hack to keep me down. 😀
Thanks to @TwitterIndia & many others who helped. 🙏🏽 https://t.co/h9RCJVrU4m— Syed Akbaruddin (@AkbaruddinIndia) January 14, 2018