MS Dhoni ICC Spirit of Cricket Award of the Decade: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు ధోనీని వరించగా.. పరుగుల యంత్రం, ఛేజింగ్ స్టార్.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ ఆటగాడు అవార్డుతో పాటు వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు ప్రకటించారు. ఈ దశాబ్దకాంలో స్ఫూర్తిని ప్రదర్శించిన అవార్డు ధోనీకి రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ధోనీ స్ఫూర్తిని ప్రదర్శించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 2011లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. తొలి టెస్టులో టీమిండియా 196 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) తన సహనాన్ని కోల్పోదు. పైగా స్ఫూర్తిని ప్రదర్శించాడు.నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేసిన ఇంగ్లాండ్... భారత్ ముందు 478 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Also Read: Pakistan vs New Zealand: స్టేడియంలోకి నగ్నంగా దూసుకొచ్చిన అభిమాని.. Viral Video
🇮🇳 MS DHONI wins the ICC Spirit of Cricket Award of the Decade 👏👏
The former India captain was chosen by fans unanimously for his gesture of calling back England batsman Ian Bell after a bizarre run out in the Nottingham Test in 2011.#ICCAwards | #SpiritOfCricket pic.twitter.com/3eCpyyBXwu
— ICC (@ICC) December 28, 2020
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ వివాదం తలెత్తింది. టీ బ్రేక్‌కు వెళ్లే ముందు చివరి బంతిని ఇయాల్ బెల్ ఎదుర్కొన్నాడు. ఇషాంత్ శర్మ (Ishant Sharma) వేసిన బంతిని బౌండరీకి తరలించానని భావించిన బెల్.. పిచ్ మధ్యలోనే ఆగిపోయాడు. మూడు పరుగులు పూర్తి చేసేలోగా బంతి బౌండరీకి వెళ్లిందని పరుగు పూర్తచేయకుండానే టీ బ్రేక్‌కు బయలుదేరాడు. కానీ బౌండరీ దగ్గర బంతిని ఆపిన ప్రవీణ్ కుమార్ త్రో విసిరాడు. అభినవ్ ముకుంద్ వికెట్లను గిరాటేసి అప్పిల్ చేయగా, ఆపై థర్డ్ అంపైర్ చెక్ చేసి ఇయాన్ బెల్‌ను రనౌట్‌గా అంపైర్లు ప్రకటించారు.
Also Read: Tim Paine: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత
బ్రేక్ సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జరిగిన పొరపాటును, విషయాన్ని భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వివరించారు. ధోనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో టీ బ్రేక్ తర్వాత ఇయాన్ బెల్ సైతం బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 300 పరుగులకు పైగా తేడాతో మరో దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. అయితే మహీ క్రీడాస్ఫూర్తి మాత్రం గుర్తుండిపోయింది. నేడు అవార్డును దక్కేలా చేసింది.
Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook