Arvind kejriwal: ఆరు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Arvind kejriwal: దేశ రాజధానిని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సై అంటోంది. ఇతర పార్టీలకు సవాలు విసురుతోంది. ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ఆప్ వెల్లడించింది.

Last Updated : Jan 28, 2021, 06:07 PM IST
Arvind kejriwal: ఆరు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Arvind kejriwal: దేశ రాజధానిని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సై అంటోంది. ఇతర పార్టీలకు సవాలు విసురుతోంది. ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ఆప్ వెల్లడించింది.

దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో వరుసగా మూడవసారి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Aadmi Party ) ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇతర పార్టీలకు సవాలు విసురుతూ సై అంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ( Delhi Cm Arvind kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 9వ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రెండేళ్ల వ్యవధిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ( Aap to contest in 6 state elections ) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గతాన్ని వదిలేయాలని..భవిష్యత్ గురించి ఆలోచించేపార్టీ తమదేనని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే  ( Republic day ) రోజు జరిగిన పరిణామాలపై స్పందించారు. హింసకు పాల్పడిన రైతుల్ని అరెస్టు చేయాలని కోరారు. జరిగిన ఘటనలు క్షమించరానివని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. హింసాత్మకమైనా సరే..రైతుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విధ్వంసానికి కారణం ఏ పార్టీ అయినా, ఏ నేతయినా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అందరూ కలిసి రైతులకు మద్దతివ్వాలని కోరారు. 

Also read: Farmers tractor rally: ఢిల్లీ ఘటనపై కేంద్రం సీరియస్, 20 మందికి నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News