దిల్ రాజును ఆయన Dil Raju కాదు.. Kill Raju అంటూ క్రాక్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్ రాజును ఏకిపారేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో Warangal Srinu పై దిల్ రాజుకు ఇంకా కోపం పోలేదని తెలుస్తోంది. వరంగల్ శ్రీను తమకు క్షమాపణలు చెప్పాలని దిల్ రాజు, దిల్ రాజు తమ్ముడు శిరీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ (Nizam market)లో దిల్ రాజు, శిరీశ్ రెడ్డి ఇద్దరూ ప్రొడ్యూసర్స్‌ను తొక్కేస్తున్నారని, థియేటర్ల విషయంలో నియంత పాలన కొనసాగుతోందని వరంగల్ శ్రీను ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
నైజాం రీజియన్‌లో రవితేజ 'క్రాక్' సినిమాకి ( Krack movie ) కేటాయించిన థియేటర్లను రెండవ వారంలో దిల్ రాజు వేరే సినిమాకు తీసుకున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, దిల్ రాజుల మద్య ఈ వివాదం తలెత్తింది. దిల్ రాజు, శిరీష్‌లు తనను అవమానించారని, ఉద్దేశపూర్వకంగానే తన వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని డిస్ట్రిబ్యూటర్ శ్రీను తీవ్ర ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా ఇకపై తాను సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం పక్కనపెట్టి, దిల్ రాజు పనిలోనే పడతానని అప్పట్లో శ్రీను హెచ్చరించాడు.
Also read : Chiranjeevi to join Janasena ? : చిరంజీవి జనసేన పార్టీలో చేరనున్నారా ?
అయితే, తాను దిల్ రాజు కాదు... కిల్ రాజు అని ఆరోపిస్తూ తనని అవమానించినందుకు వరంగల్ శ్రీను తమకు క్షమాపణలు చెప్పాలని దిల్ రాజు, శిరీష్ డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, వరంగల్ శ్రీను నుండి క్షమాపణ కోరనుంది. మరోవైపు వరంగల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శ్రీను కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. తాను ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయలేదని శ్రీను తెలిపాడు. దిల్ రాజుతో కొన్ని వివాదాలు ఉన్న ఓ పెద్ద ప్రొడక్షన్ హౌజ్ నుంచి శ్రీనుకి మద్దతు కూడా ఉందని తెలుస్తోంది. అందుకే Dil Raju లాంటి బడా నిర్మాతను Kill Raju అంటూ Warangal Srinu అంత తీవ్ర ఆరోపణలు చేశాడనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ వివాదం ఎటువంటి పరిణామాలకు దారితీయనుందో వేచిచూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook