ఆకాశంలో అద్భుత దృశ్యం..సంపూర్ణ చంద్ర గ్రహణం

చంద్ర గ్రహణం సమయం: సాయంత్రం 5: 21 నుండి రాత్రి 8:45 వరకు

Last Updated : Feb 3, 2018, 11:08 AM IST
ఆకాశంలో అద్భుత దృశ్యం..సంపూర్ణ చంద్ర గ్రహణం

చంద్ర గ్రహణం సమయం: సాయంత్రం 5: 21 నుండి రాత్రి 8:45 వరకు 

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉండి.. సూర్యుడికి, చందమామకు మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు 'చంద్ర గ్రహణం' ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం పౌర్ణమి రోజున వస్తుంది. చంద్ర గ్రహణం కొన్ని నిమిషాలు లేదా ఒక్కోసారి గంటలసేపు కనిపిస్తుంది.

కానీ నేడు సంభవించే సంపూర్ణ చంద్ర గ్రహణానికి ఒక విశేషం ఉందండోయ్..! ఇలాంటి చంద్రగ్రహణం 150ఏళ్లకు ఒకసారి వస్తుందట. ఈసారి జనవరి నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చింది. ఇలా ఒకేనెలలో వచ్చే రెండో పౌర్ణమిని 'బ్లూ మూన్' అని అంటారు.  ఇలా జనవరి 31న వచ్చే 'బ్లూ మూన్' రోజే చంద్ర గ్రహణం ఏర్పడడం విశేషం. ఈ గ్రహణం సమయంలో చంద్రుడి కిందిభాగం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 

సూర్య గ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు. రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో మూడ నమ్మకం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను కూడా మూసివేస్తారు. 

ఈ సంపూర్ణ గ్రహణాన్ని మధ్య, తూర్పు ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రజలు చూడవచ్చు. ఇటువంటి గ్రహణంను చివరిసారి మార్చి 31, 1866లో చూశారట ప్రజలు. 

Trending News