Ranbir Kapoor Tests COVID-19 Positive: బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో నటుడికి పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. వైద్యల సలహాలు పాటిస్తూ మెడిసిన్ తీసుకుంటున్నారని నీతూ కపూర్ చెప్పారు. ట్రీట్‌మెంట్‌కు రణబీర్ కపూర్ శరీరం సహకరిస్తుందని, ఏ సమస్య లేదని ఆయన తల్లి నీతూ కపూర్ వెల్లడించారు. అధికారిక ప్రకటన చేసిన రణబీర్ కపూర్(Ranbir Kapoor) అభిమానులకు, కపూర్ ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చారు.
Also Read: Dethadi Harika: బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దేత్తడి హారికకు Telangana ప్రభుత్వం బంపరాఫర్
నీతూ కపూర్ పోస్ట్‌లో ఏం పేర్కొన్నారు..
రణబీర్ కపూర్‌కు కోవిడ్-19 (COVID-19) పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం రణబీర్ కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రణబీర్ కపూర్ ఆరోగ్యం పట్ల స్పందిస్తున్న వారికి, అతడు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ నీతూ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Also Read: Sathyameva Jayathe Song: పవన్ కళ్యాణ్ Vakeel Saab నుంచి సత్యమేవ జయతే సాంగ్, మీరూ వీక్షించండి
కెరీర్ విషయానికొస్తే నటుడు రణబీర్ కపూర్ చేతిలో కొన్ని సినిమాలున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమాతో తెరమీద కనిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు రణబీర్ కపూర్. అమితాబ్ బచ్చన్, అలియా భట్ మరియు మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. సంజయ్ దత్, వాణీ కపూర్‌లతో కలిసి మరో సినిమాలో నటిస్తున్నాడు. లవ్ రంజన్ ప్రాజెక్టులో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో కలిసి మరో మూవీతో బిజీగా ఉన్నాడు. అనుకోని పరిస్థితులలో కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook