Covid-19 latest updates from across India: న్యూఢిల్లీ : హోలీ పండగ కంటే ముందే కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికార యంత్రాంగాలు సైతం ఆంక్షలు కఠినతరం చేశాయి. ఇంకొన్ని చోట్ల మళ్లీ లాక్డౌన్ లేదా నైట్ కర్ప్యూ (Lockdown or night curphew) పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే సమయంలో మార్చి 29న జరగనున్న హోలీ పండగపై (Holi festival 2021) కూడా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతోంది.
హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిస్థితులు కూడా అదే తరహాలో ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం దేశంలో కరోనావైరస్ (Coronavirus) కారణంగా పరిస్థితులు మళ్లీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 59,118 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 అక్టోబర్ తరువాత ఇలా రికార్డు స్థాయిలో అత్యధికంగా రోజువారీ కేసులు నమోదవడం మళ్లీ ఇదే ప్రథమం. దీంతో ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 1,18,46,652 కు చేరుకుంది. గత 2 వారాలుగా కరోనా కేసుల (Corona) సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోనే కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా, పరిస్థితిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.
గత 24 గంటల్లో 257 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు కరోనా (Corona) కారణంగా మరణించిన వారి సంఖ్య 1,60,949 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 32,987 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637 కు చేరింది.
Also read : COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు
ఉత్తర ప్రదేశ్‌లో హైకోర్టు మూసివేత (UP High court closed):
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, లక్నోలో COVID-19 కేసుల సంఖ్య భారీగా పెరిగినందున, ఈ రెండు జిల్లాల్లోని హైకోర్టు ఏప్రిల్ 1, 2 తేదీలలో మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, ఈ 2 రోజుల్లో కేసుల నమోదుకు సంబంధించి ఫిజికల్ ఫైలింగ్ కానీ లేదా ఇ-ఫైలింగ్ ( Physical filing or e-filing) కానీ ఉండవు అని యూపీ హై కోర్టు (UP high court) స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథుర్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1, 2 తేదీలలో విచారణకు రావాల్సి ఉన్న కేసులను వరుసగా ఏప్రిల్ 6, 8 తేదీలలో ప్రయాగ్‌రాజ్ కోర్టులో విచారణ జరపనున్నారు.
అంతకంటే ముందుగా మార్చి 28 నుండి 31 వరకు హోలీ సెలవుల (Holi 2021 holidays) కారణంగా హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 3, 4 తేదీలలో వారాంతం కారణంగా సెలవులు రానున్నాయి. అంటే మొత్తంగా ఏప్రిల్ 5 నుండే హైకోర్టులో పిటిషన్ల విచారణ పునఃప్రారంభం కానుందన్నమాట.
బీహార్‌లో పెరుగుతున్న కేసులు (COVID-19 cases in Bihar):
బీహార్‌లోనూ గతంలో పోల్చుకుంటే ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడం మొదలైంది. మార్చి 15 న రాష్ట్రంలో 26 మందికి కరోనా సోకినట్టు గుర్తించగా.. ఆ సంఖ్య మార్చి 20 న 88 మందికి, అదేవిధంగా మార్చి 23 న 111 మందికి, మార్చి 24న 170 మందికి, మార్చి 25 న 258 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో క్రమంగా పెరుగుతున్న కేసుల పట్ల బీహార్ సర్కార్ (Bihar govt) ఓ కన్నేసి పెట్టింది.
రోగుల సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. మార్చి 15 న బీహార్‌లో 327 యాక్టివ్ కేసులు ఉండగా.. మార్చి 25 నాటికి 924 కి చేరింది.
Also read : Headache with COVID-19: కరోనాతో వచ్చే తలనొప్పికి, సాధారణ తలనొప్పికి Symptoms ఎలా ఉంటాయి ?
మధ్యప్రదేశ్‌లో 'మేరీ హోలీ మేరా ఘర్' (Mera Holi mera ghar):
కరోనావైరస్ వ్యాప్తి పట్ల మధ్యప్రదేశ్ సర్కార్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హోలీ పండగ (Holi 2021 festival) సందర్భంగా ప్రజలు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లోనే పండుగను జరుపుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 'మేరీ హోలీ మేరా ఘర్' (Mera Holi mera ghar abhiyan) ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం నుంచి మార్కెట్లు రాత్రి 10 గంటలకు బదులుగా 9 గంటలకు మూసివేయాలని నిర్ణయించారు.
అంతేకాకుండా, హోలికా దహన్ వేడుకల (Holika dahan) నిర్వహణ సమయంపైనా ఆంక్షలు అమలులో ఉంటాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అన్ని మందిరాలు మూసే ఉంటాయి. అప్పటివరకు దేవాలయాల్లో పూజారులు మాత్రమే పూజలు నిర్వహించనున్నారు.
ఢిల్లీలోనూ ఆందోళనకర పరిస్థితి (Corona cases in Delhi):
ఢిల్లీలో గత నాలుగు రోజుల్లో కొత్తగా వచ్చిన కరోనా కేసుల సంఖ్య గత ఫిబ్రవరిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. గత నాలుగు రోజుల్లో దేశ రాజధానిలో 4758 కేసులు నమోదు కాగా మొత్తం ఫిబ్రవరిలో 4193 కేసులు నమోదయ్యాయి. గురువారం ఢిల్లీలో కొత్తగా 1,515 కరోనా కేసులు ( Corona cases in Delhi) వెలుగుచూశాయి. డిసెంబర్ 16 తర్వాత ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదడం ఇదే తొలిసారి.
కరోనా కంటే కరోనా సెకండ్ వేవ్ మరీ డేంజరా (Coronavirus second wave)?
ఎస్బిఐ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం రాబోయే 20-25 రోజుల్లో కరోనా సంక్రమణ గరిష్ట స్థాయికి చేరుకోనుందని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మొత్తం 100 రోజుల పాటు ఉంటుందని, అదే సమయంలో మొత్తం సంక్రమణ కేసులు సుమారు 2.5 మిలియన్లకు చేరవచ్చని ఆ నివేదిక స్పష్టంచేసింది.
Also read: COVID-19 updates: Pregnant ladies కి షాకింగ్ న్యూస్ !
కర్ణాటకలో మళ్లీ నిషేధాజ్ఞలు.. బయటివాళ్లకు ఆర్టీ-పిసిఆర్ నివేదిక తప్పనిసరి (Corona RT-PCR test report):
బెంగుళూరులో గురువారం కొత్తగా 1400 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో ఇదే అత్యధిక రోజువారీ సంఖ్య కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి పట్ల కఠిన చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుండి బెంగళూరుకు వచ్చే వారికి కరోనా వైరస్ లేదని చెప్పే COVID-19 RT-PCR test నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. కర్ణాటక మంత్రి డాక్టర్ కె సుధాకర్ (Minister Dr K Sudhakar) దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి రానుంది.
బెంగళూరులో 60 శాతం కేసులు ఇతర రాష్ట్రాలను సందర్శించే వ్యక్తుల నుండే వచ్చాయనే నివేదికల నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మహారాష్ట్రలో మరింత దిగజారుతున్న పరిస్థితి (Corona cases in Maharashtra):
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 35 వేలకు పైగా కేసులు (Maharashtra Corona Cases) నమోదయ్యాయి. 111 మంది కరోనాతో మరణించారు. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కఠిన చర్యలకు పూనుకున్నారు. అదే సమయంలో, మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,62,685 కి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook