Irfan Pathan Tested COVID-19 Positive | ఇటీవల టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ కోవిడ్-19 బారిన పడగా, తాజాగా అతడి సోదరుడు, భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం వైరస్ బారిన పడ్డాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లలో కోవిడ్19 బారిన పడ్డ నాలుగో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కావడం గమనార్హం. కోవిడ్ నిబంధనలు పాటించకుండా సిరీస్ ఆడటంతో వరుసగా క్రికెటర్లు మహమ్మారి బారిన పడుతున్నారు.
తొలుత టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా సోకింది. తాను కరోనా బారిన పడ్డానని స్వయంగా సచిన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన కుటుంబ సభ్యులకు సైతం కోవిడ్-19 టెస్టులు జరపగా వారికి నెగటివ్ వచ్చిందని సచిన్ తెలిపాడు. ఈ క్రమంలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న సుబ్రమణ్యం బద్రీనాథ్, ఆపై టీమిండియా(Team India) మాజీ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం కరోనా బారిన పడ్డాడు.
Also Read: IND vs ENG 3rd ODI Highlights: టీమిండియా కెప్టెన్ Virat Kohli స్టన్నింగ్ క్యాచ్, Viral Video
— Irfan Pathan (@IrfanPathan) March 29, 2021
తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా సోకింది. సోమవారం రాత్రి ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చాడు. అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించాలని ట్వీట్ ద్వారా ఇర్ఫాన్ పఠాన్ కోరాడు. రోడ్ సేఫ్టీ సిరీస్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌పై ఇండియా లెజెండ్స్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుమతి, పర్యవేక్షణ లేకుండా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరిగింది. రిటైర్మెంట్ అయిన క్రికెటర్లకు నిర్వహించిన అనధికారిక, ప్రైవేట్ టోర్నీ కావడంతో ఇందులో కోవిడ్19 నిబంధనలు తుంగలో తొక్కారు. వీక్షకులు భారీ సంఖ్యలో మైదానాలకు వచ్చినా చాలా మంది మాస్కులు ధరించలేదు, భౌతిక దూరం లాంటి కోవిడ్-19(COVID-19) నిబంధనలు పాటించకపోవడంతో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook