Maha Kumbhmela: కుంభమేళాపై ముంబై మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Maha Kumbhmela: ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. కరోనా హాట్‌స్పాట్‌గా కుంభమేళా మారుతోందంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో ముంబై మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2021, 03:49 PM IST
Maha Kumbhmela: కుంభమేళాపై ముంబై మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Maha Kumbhmela: ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. కరోనా హాట్‌స్పాట్‌గా కుంభమేళా మారుతోందంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో ముంబై మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona second wave)పంజా విసురుతోంది. ఈ తరుణంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌( Haridwar)లో జరుగుతున్న మహా కుంభమేళా( Maha Kumbhmela) వివాదాస్పదమవుతోంది.ఇప్పటికే చాలా మంది కుంభమేళాపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. లక్షలాది జనం ఒక్కసారిగా ఒకేచోట గుమిగూడి స్నానాలు ఆచరిస్తూ కరోనాకు హాట్‌స్పాట్(Corona Hotspot)‌గా మారడం తెలిసిందే. ఇప్పటికే కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో చాలామందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ క్రమంలో కుంభమేళాను ప్రతీకాత్మకంగా అంటే జనం లేకుండా జరపాలని ప్రధాని మోదీ ( Pm Modi) సాధువుల్ని కోరారు. ఇదే విషయాన్ని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ నేపధ్యంలో ముంబై మేయర్ (Mumbai Mayor ) కిశోరి పెడ్నేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో పాల్గొని వస్తున్న భక్తులంతా కరోనాను ప్రసాదంలా పంచుతున్నారని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ కుంభమేళా భక్తుల్ని క్వారంటైన్ చేయాలని ఆమె సూచించారు. ఎవరైనా కుంభమేళా నుంచి వారి వారి రాష్ట్రాలు, ఊర్లకు వెళ్తున్నారా వారంతా కరోనాను ప్రసాదంలా పంచి పెడతారని వ్యాఖ్యానించారు. ముంబైకు తిరిగొచ్చిన కుంభమేళా భక్తులందరినీ సొంత ఖర్చులతోనే క్వారెంటైన్‌లో పెడతామన్నారు. చిన్న చిన్న ఆంక్షలు పెడితే సరిపోదని..కరోనా కట్టడికి ముంబైలో పూర్తి లాక్‌డౌన్ ( Lockdown in Mumbai) విధించాల్సిందేనన్నారు. కేసులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

Also read: 7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News