IPL 2021 Latest Updates | క్రికెట్ ప్రేమికులు కోరుకున్న మ్యాచ్ నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 18 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. కానీ క్రికెట్ ప్రేమికులు మాత్రం ఐపీఎల్ మజాను ఆస్వాదించారు. ముంబైలోని వాంఖేడేలో తొలుత సీఎక్కే 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో కేకేఆర్ జట్టు 202 పరుగులకు ఆలౌటైంది.
అద్భుతంగా పోరాడినా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మ్యాచ్ ఓడిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు భారీ జరిమానా విధించారు. సీఎస్కేతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా విదించారు. మరోసారి ఈ సీజన్లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ తప్పిదాన్ని రిపీట్ చేస్తే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(KKR Captain Eoin Morgan)కు రూ.24 లక్షల జరిమానా విధిస్తారు. కేకేఆర్ జట్టు ఆటగాళ్లకు ఒక్కొక్కరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత లేదా రూ.6 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
Also Read: హ్యాట్రిక్ ఓటమి తర్వాత PBKS పై గెలిచి IPL 2021లో ఖాతా తెరిచిన SRH
ఒకవేళ ఐపీఎల్ 2021లో కేకేఆర్ జట్టు మూడో పర్యాయం స్లో ఓవర్ రేటు తప్పిదం చేసినట్లయితే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. జట్టు ఆటగాళ్లకు ఒక్కొక్కరి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత లేదా రూ12 లక్షల జరిమానా, ఇందులో ఏది తక్కువ అయితే దాన్ని ఆటగాళ్లు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు వరుసగా 3 విజయాలతో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని సీఎస్కే జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చెందనప్పటికీ మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా IPL 2021 పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి పడిపోయింది.
Also Read: IPL 2021: ఎంఎస్ ధోనీకి షాక్, CSK కెప్టెన్ తల్లిదండ్రులకు COVID-19 పాజిటివ్
కాగా, ఐపీఎల్ తాజాగా సీజన్లో జరిమానాను ఎదుర్కొన్న మూడో కెప్టెన్‌గా కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిలిచాడు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు సీజన్లో ఇదివరకే జట్టు బౌలింగ్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానాను ఎదుర్కొన్నారు. సీఎస్కే దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇయాన్ మోర్గాన్ పదే పదే బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్ మార్పులు చేయడంతో బౌలింగ్ కోటాను పూర్తి చేయడానికి కేకేఆర్ ఆటగాళ్లు అధిక సమయం తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook