Doctor got suspended for demanding money for Corona test: సూర్యాపేట: పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో కరోనా టెస్టు కోసం వచ్చిన వారు 500 రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ కరోనా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన డాక్టర్ క్రాంతి కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కరోనా లక్షణాలతో బాధపడేవారు కరోనా పరీక్షల కోసం అని వస్తే అక్కడ డాక్టర్ క్రాంతి కుమార్ వారి నుంచి రూ. 500 డిమాండ్ చేస్తుండగా చిత్రీకరించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ పాజిటివ్ వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని, నెగటివ్ వస్తే మాత్రం తిరిగి ఇచ్చేది లేదని డాక్టర్ ఆ వీడియోలో చెప్పడం జనాన్ని ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేసింది.
ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు లేకుండానే ఇలా డబ్బులు చేయడం తప్పు కదా అని రోగులు ప్రశ్నించినప్పటికీ.. తనను తానే సమర్ధించుకున్న వైద్యుడి బాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సూర్యాపేట డీఎంహెచ్ఓ (Suryapet DMHO) అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
కరోనా పరీక్షలకు ఒక్కొక్కరి నుండి రూ. 500 డిమాండ్ చేసిన పెన్పహడ్ డాక్టర్ క్రాంతి కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసిన సూర్యాపేట డీఎంహెచ్ఓ.. @CollectorSRPT @spsuryapet @Eatala_Rajender @TelanganaCMO #NewZeeDigital pic.twitter.com/qHWyZFsJmg
— ZEE HINDUSTAN TELUGU (@ZeeHTelugu) April 26, 2021
Also read : పంజాబ్‌లో రోజూ night curfew.. వారాంతాల్లో Weekend lockdown
అంతకంటే ముందుగా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్వయంగా చేరుకున్న డిఎంహెచ్ఓ కోటాచలం.. అక్కడి పరిస్థితిని రోగుల ద్వారానే అడిగి తెలుసుకున్నారు. తమ విచారణలో డాక్టర్ క్రాంతి కుమార్ కరోనా పరీక్షల (COVID-19 tests) కోసం వచ్చిన రోగుల నుంచి డబ్బులు దండుకున్న మాట వాస్తవమేనని తేలడంతో తక్షణమే అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ (Penpahad doctor suspended by DMHO) డీఎంహెచ్‌ఓ కోటాచలం ఆదేశాలు జారీచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook