Tollywood: కొరటాల శివ సినిమాలో జూనియర్ రోల్ ఏది..అంత పవర్ ఫుల్ పాత్రనా

Tollywood: జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ అంటేనే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీలో ఎన్టీఆర్ పాత్రపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏ పాత్రలో ఎన్టీఆర్ కన్పించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2021, 12:11 PM IST
 Tollywood: కొరటాల శివ సినిమాలో జూనియర్ రోల్ ఏది..అంత పవర్ ఫుల్ పాత్రనా

Tollywood: జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ అంటేనే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీలో ఎన్టీఆర్ పాత్రపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏ పాత్రలో ఎన్టీఆర్ కన్పించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.

టాలీవుడ్‌లో(Tollywood) సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్న వ్యక్తి కొరటాల శివ. ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లతో చేసిన సినిమాలు సూపర్ హిట్‌లుగా నిలిచాయి. 2016లో జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన జనతా గ్యారేజ్(Janata Garrage movie) సూపర్ డూపర్ హిట్టైంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR)-కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. జనతా గ్యారేజ్ తరువాత ఇద్దరూ కలిసి చేయనున్న ప్రాజెక్టు ఇదే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉంటే..ప్రతిష్టాత్మకమైన ఆచార్య సినిమా ( Acharya Movie)లో చిరంజీవితో కొరటాల శివ( Koratala siva) బిజిగా అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా తెరకెక్కనుంది.

అంతవరకూ బాగానే ఉంది. మరి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులో ఎలా కన్బించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. విద్యార్ధులు, రాజకీయాలు ఇతివృత్తంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కన్పించనున్నాడని సమచారం. రాజకీయాల కారణంగా విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతో..బరిలో దిగిన హీరోకు ఎదురయ్యే పరిస్థితులు, వాటిని ఎలా అధిగమిస్తాడు..ఆ క్రమంలో విజయం సాధిస్తాడా లేదా అనేది ప్రధానంగా సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనేది నిర్ణయం కాలేదు.

Also read: Anchor Shyamala: తన భర్త నరసింహా రెడ్డిపై చీటింగ్ కేసులో వీడియో విడుదల చేసిన యాంకర్ శ్యామల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News