Assembly Election 2021: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Assembly Election 2021 Results Live News Update: గతానికి భిన్నంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని కోవిడ్19 నిబంధనలతో ఈ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. బెంగాల్, తమిళ ప్రజలు ఎవరికి ఓటేశారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 2, 2021, 09:06 AM IST
Assembly Election 2021: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Assembly Election 2021 Counting Live News Update: ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు మొదలైంది. గతానికి భిన్నంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని కోవిడ్19 నిబంధనలతో ఈ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. బెంగాల్, తమిళ ప్రజలు ఎవరికి ఓటేశారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు, తిరుపతి, నాగార్జునసాగర్ స్థానాలకు ఉప ఎన్నికలు ఇటీవల నిర్వహించారు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 822 స్థానాలకు కోవిడ్ నిబంధనలతో పలు విడుతలలో ఎన్నికలు నిర్వహించగా, నేడు ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు చేపట్టింది. మొత్తం 2,364 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు(Assembly Election 2021 Counting) జరుగుతుండగా దాదాపు సగం హాళ్లు పశ్చిమ బెంగాల్‌లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఫలితం తేలనుంది.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 02, 2021, ఓ రాశివారికి ధనవ్యయం

పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. బెంగాల్‌లో అధికారం తమదేనని భారతీయ జనతా పార్టీ(BJP) శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు తమకే మరోసారి పట్టం కట్టారని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఓటమి తప్పదని, తమను విజయం వరిస్తుందని బీజేపీ, ఏఐఏడీఎంకే మరియు ఏఐఎన్‌ఆర్‌సీ కూటమి నేతలు చెబుతున్నారు.

Also Read: Election Commission: ఎన్నికల కౌంటింగ్‌కు ఈసీ కఠిన ఆంక్షలు, నిబంధనలు 

కాంగ్రెస్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నేటి ఉదయం పుత్తుపల్లి చర్చికి వెళ్లిన ఆయన తాను విజయం సాధించాలని కోరుకుంటూ పూజలు చేశారు. పుత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఉమెన్ చాందీ పోటీ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News