Husband died of COVID-19: భర్త కరోనాతో చనిపోయాడని..

Wife committed suicide as her husband died of COVID-19: ఇండోర్: కరోనావైరస్ జనంలో అనేక రకాల ఆందోళనలకు కారణం అవుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న కరోనా వైరస్‌ను చూసి లోకం అంటే ఏంటో తెలియని సామాన్యులు వణికిపోతున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మగ దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డునపడుతుండటం కరోనా బాధితులను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2021, 05:35 AM IST
Husband died of COVID-19: భర్త కరోనాతో చనిపోయాడని..

Wife committed suicide as her husband died of COVID-19: ఇండోర్: కరోనావైరస్ జనంలో అనేక రకాల ఆందోళనలకు కారణం అవుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న కరోనా వైరస్‌ను చూసి లోకం అంటే ఏంటో తెలియని సామాన్యులు వణికిపోతున్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని, తమ మానసిక పరిస్థితిపై కరోనా ప్రభావం పడకుండా చూసుకోవాలని పదేపదే ప్రభుత్వాలు, మానిసక నిపుణులు చెబుతూనే ఉన్నప్పటికీ.. కొంతమంది ఇంకా కరోనా అనే భయంలోంచి బయటికి రాలేకపోతున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మగ దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డునపడుతుండటం కరోనా బాధితులను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి. దీంతో కరోనా సోకిన వాళ్లు కొంత మంది, కరోనాతో అయినవాళ్లను కోల్పోయిన వాళ్లు ఇంకొంత మంది తీసుకోకూడని నిర్ణయం తీసుకుని తమ జీవితాలను అర్థాంతరంగా చాలిస్తున్నారు.

Also read : Corona symptoms ఉంటే పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు: కేంద్రం

తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కరోనావైరస్‌తో బాధపడుతున్న తన భర్త ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని ఓ మహిళ శనివారం 9 అంతస్తుల భవనంపై నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎత్తైన భవనంపై నుంచి దూకడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ఇండోర్ పోలీసులు తెలిపారు. భర్త మృతిని తట్టుకోలేకే ఆమె ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 403,626 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus cases) గుర్తించగా అదే సమయంలో 4,091 మంది కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ పాటిస్తుండగా ఇంకొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కర్ఫ్యూ అమలులో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ అమలులో ఉన్నాయి. అయినప్పటికే ఈ ఆంక్షలు ఏవీ కరోనావైరస్ ను కట్టడి చేయలేకపోతుండటంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. వీలైనంత త్వరగా కేంద్రం మేల్కొని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే (Nationwide lockdown in India), దేశంలో పరిస్థితులు మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉందని IMA అభిప్రాయపడింది. 

Also read : AP COVID-19 updates: ఏపీలో హడలెత్తిస్తోన్న కరోనా పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News