సాధారణంగా దేశ ప్రధానులంటే అందరూ ఖరీదైన కార్ల మీదే ప్రయాణిస్తారు.. కానీ ఈ దేశ ప్రధాని కాస్త వెరైటీగా ఆలోచించి ఓ అడుగు ముందుకు వేశారు. సైకిల్ మీద ఆ దేశరాజును కలవడానికి బయలుదేరారు. అతనే నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే. నెదర్లాండ్స్ కింగ్ విల్లమ్ అలెగ్జాండర్ ప్యాలెస్‌కు అతను సైకిల్ మీద వెళ్లిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ప్యాలెస్ ఆవరణలో ఆయన సైకిల్‌ను పార్క్ చేసి లాక్ వేయడం ఫోటోలో చూసిన అనేకమంది నెటిజన్లు ట్విటర్లో కామెంట్లు పోస్టు చేశారు. అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు, ప్రధాని ఆ సైకిల్‌కు లాక్ ఎందుకు వేశారో అంటూ ఆ ఫోటోపై జోకులు కూడా వేశారు కొందరు. అయితే విషయానికి వస్తే, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టేకి అలా సైకిల్ మీద ప్రయాణించడం కొత్తేమీ కాదట. అప్పుడప్పుడు అధికారిక సమావేశాలకు కూడా సైకిల్ మీదే వెళ్తున్నారట. ఆ మధ్య మన దేశ ప్రధాని నెదర్లాండ్స్ వెళ్లినప్పుడు, రుట్టే మోడీకి ఒక సైకిల్‌ను కానుకగా ఇవ్వడం కూడా అప్పట్లో సంచలనమైంది.