Sarkau vaari Paata first look poster updates: మహేష్ బాబు ఫ్యాన్స్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట మూవీ నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఫిలింనగర్ టాక్. మే 31న అలనాటి సూపర్ స్టార్ క్రిష్ణ బర్త్ డే కావడంతో అదే రోజున సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేందుకు దర్శకుడు పరశురామ్ ఫస్ట్ లుక్ డిజైనింగ్ చేయిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
సర్కారు వారి పాట మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో జరిగే అవినీతి కుంభకోణాల నేపథ్యంతో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతోంది. మహేష్ బాబు అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేలా కావాల్సినంత కామెడి, యాక్షన్ సీక్వెల్స్‌తో పరశురామ్ సర్కారు వారి పాట మూవీని తెరకెక్కిస్తున్నాడు.
Also read : BA Raju died: బిఏ రాజు ఇక లేరు.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన టాలీవుడ్
కరోనావైరస్ సెకెండ్ వేవ్ (Corona second wave) కారణంగా సర్కార్ వారి పాట మూవీ షూటింగుకి అనుకోకుండా బ్రేకులు పడ్డాయి. పరిస్థితుల్లో మార్పు వచ్చి, కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ (Sarkau vaari Paata shooting) ప్రారంభం కానుంది.
Also read: Anchor Anasuya's role in Pushpa: యాంకర్ అనసూయకు గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook