Anchor Anasuya's role in Pushpa: యాంకర్ అనసూయకు గుడ్ న్యూస్

Anchor Anasuya's role in Pushpa: యాంకర్ అనసూయకు, అనసూయను సినిమాల్లో చూసుకుని మురిసిపోయే ఆమె అభిమానులకు ఓ గుడ్ న్యూస్. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ క్రేజును దృష్టిలో పెట్టుకునే పుష్ప సినిమాలోనూ యాంకర్ అనసూయకు సుకుమార్ ఓ పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2021, 06:30 AM IST
Anchor Anasuya's role in Pushpa: యాంకర్ అనసూయకు గుడ్ న్యూస్

Anchor Anasuya's role in Pushpa: యాంకర్ అనసూయకు, అనసూయను సినిమాల్లో చూసుకుని మురిసిపోయే ఆమె అభిమానులకు ఓ గుడ్ న్యూస్. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ క్రేజును దృష్టిలో పెట్టుకునే పుష్ప సినిమాలోనూ యాంకర్ అనసూయకు సుకుమార్ ఓ పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాను పార్ట్ 1, పార్ట్ 2 అని రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయానికొచ్చిన దర్శకుడు సుకుమార్.. ఆ మేరకు కథకు అనుగుణంగా, ఎక్కడా ఫ్లో దెబ్బతినకుండా యాంకర్ అనసూయ పాత్ర నిడివి కూడా పెంచాలని డిసైడ్ అయినట్టు ఫిలింనగర్ టాక్. 

సుకుమార్ యాంకర్ అనసూయ పాత్ర నిడివి పెంచిట్టే అయితే.. అల్లు అర్జున్, రష్మిక మంధన్న (Rashmika Mandanna) వంటి స్టార్స్ నటించిన సినిమాలో ఎక్కువసేపు కనిపించే ఛాన్స్ కొట్టేసిన అనసూయకు, ఆమెను ఎక్కువసేపు స్క్రీన్‌పై చూసే ఛాన్స్ అందుకున్న ఆమె అభిమానులకు ఇది గుడ్ న్యూస్ కాక ఇంకేమవుతుంది మరి అంటున్నారు అనసూయ ఫ్యాన్స్. 

Also read : BA Raju died: బిఏ రాజు ఇక లేరు.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన టాలీవుడ్

ఒకప్పుడు సినిమాలపై అంతగా ఆసక్తి చూపించని యాంకర్ అనసూయ.. ఇప్పుడు మాత్రం ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతోనే అయ్యుంటుందేమో! అందుకు తగినట్టుగానే ఇప్పుడు పుష్ప మూవీకి మరిన్ని డేట్స్ కేటాయించే ఛాన్స్ వచ్చిందామెకు. అంటే మరింత పారితోషికం కూడా అన్నమాట. 

పుష్ప పార్ట్ 1 మూవీకి సంబంధించి అల్లు అర్జున్‌పై (Allu Arjun) కీలక సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. మరో నెల రోజుల పాటు షూటింగ్ చేస్తే పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం అయిపోయినట్టే అవుతుంది.

Also read : Actresses trolled: సమంత, నయనతార, దీపిక సింగ్, జాస్మిన్.. ఈ వారం ట్రోలింగ్‌కి గురైన హీరోయిన్స్

Trending News