Supreme Court: శ్మశానాల్లో అధిక డబ్బులకు వ్యతిరేకంగా పిటీషన్

Supreme Court: కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనం అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుని శ్మశానానికి వెళితే..అక్కడ కూడా లూటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆగ్రహం చెందిన ఓ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2021, 12:19 PM IST
 Supreme Court: శ్మశానాల్లో అధిక డబ్బులకు వ్యతిరేకంగా పిటీషన్

Supreme Court: కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనం అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుని శ్మశానానికి వెళితే..అక్కడ కూడా లూటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆగ్రహం చెందిన ఓ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కరోనా సంక్రమణతో ఓ వైపు ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరోవైపు శ్మశానాల్లో అంత్యక్రియలకు పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. అటు అంబులెన్స్‌లకు కూడా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిస్ట్రెస్ మేనేజ్‌మెంట్ కలెక్టివ్ ఇండియా సంస్థ ఓ సుప్రీంకోర్టులో(Supreme Court) పిటీషన్ దాఖలు చేసింది. చనిపోయినవారికి కూడా హక్కులుంటాయని..ఆ హక్కుల్ని కాపాడేందుకు ఓ పటిష్టమైన విధానాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్‌లో కోరింది ఆ సంస్థ.

శ్మశానాల్లో కరోనా బాధితుల మృతదేహాల దహనానికి, ఖననానికి నిర్ధారిత రుసుము (Cremation Charges) మాత్రమే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని విన్నవించింది. శ్మశానాల్లో అంత్యక్రియలకు అధిక రుసుము చెల్లించలేక..డబ్బుల్లేక ఆ మృతదేహాల్ని కుటుంబ సభ్యులు వదిలేస్తుండటం బాధాకరమని వెల్లడించింది. అంబులెన్స్ వసూళ్లను కూడా అరికట్టాలని పిటీషన్‌లో కోరింది.

Also read: India Corona Deaths: భారత్‌లో 3 లక్షలకు చేరిన COVID-19 మరణాలు, అదొక్కటే ఊరట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News