Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికలు భయం రేపుతున్నాయి. మహారాష్ట్రలో అప్పుడే థర్డ్‌వేవ్ ప్రారంభమైందా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అంతమంది చిన్నారులకు కరోనా సోకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశం ఓ వైపు కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి కోలుకోలేక వణికిపోతుంటే..థర్డ్‌వేవ్ ముప్పు వణికిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్‌లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలో ఏకంగా 8 వేల మంది చిన్నారులకు కరోనా సోకడం ఆందోళన కల్గిస్తోంది. చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కోవిడ్ వార్డు పిల్లల కోసం ఏర్పాటు చేశారు.
కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన చిన్నారులకు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్కూల్ వాతావరణం ఎలా ఉంటుందో అదే విధంగా కరోనా వార్డుల్ని సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో 10 శాతం మందికి కరోనా వైరస్ సోకింది. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. మహారాష్ట్ర( Maharashtra) లో థర్డ్‌వేవ్ అప్పుడే ప్రారంభమైపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకుంటే ఇంత పెద్ద స్థాయిలో చిన్నారులకు కరోనా ఎలా సోకుతుందనే సందేహాలు వస్తున్నాయి.
Also read: Corona Third Wave: ఢిల్లీకు థర్డ్‌వేవ్ ముప్పుపై భయం రేపుతున్న ఐఐటీ నివేదిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook