China New Policy: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొదటి స్థానం చైనాది. మొన్నటి వరకూ కఠినమైన ఆంక్షల్ని విధిస్తూ వచ్చిన చైనా..ఇప్పుడెందుకో జనాభా విధానంలో మార్పులు చేస్తోంది. సడలింపులిస్తోంది.
దశాబ్దాలుగా అధిక జనాభాతో తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్న చైనా( China) వివిధ రకాల పాలసీల్ని అమలు చేసింది. కఠిన నిబంధనలు విధిస్తూ జనాభా నియంత్రణకు ప్రయత్నిస్తోంది. కఠినమైన ఆంక్షలతో సత్ఫలితాల్ని సాధించింది కూడా. అయితే యువత జనాభా తగ్గిపోయి..వృద్ధుల జనాభా ఎక్కువైపోయింది చైనాలో. ఫలితంగా చైనాలో మానవ వనరుల కొరత తీవ్రమైంది. 1950 నుంచి ఉన్న ఆంక్షల్ని 60 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత సడలించి..ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతిచ్చింది. 2016లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 6-7 దశాబ్దాలుగా కఠినమైన జనాభా నియంత్రణ నిబంధనలకు ప్రజలు అలవాటు పడిపోవడంతో పెద్దగా ప్రయోజనం కలగలేదు. 2020 జనాభా లెక్కల ప్రకారం కూడజా అక్కడ జననాల రేటు 1.3 శాతం మించలేదు.
దాంతో ఇప్పుడు మరోసారి మార్పులు చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ( China president Xi Jinping) అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చైనాలో ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిచ్చింది. ఈ విధానమైనా చైనా యువత జనాభాను పెంచుతుందో లేదో చూడాలి.
Also read: World No Tobacco Day 2021: స్మోకింగ్ చేసే వారిలో కరోనా ముప్పు 50 శాతం అధికం, WHO
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook