Bird flu in human: చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ.. మళ్లీ చైనాలోనే ఫస్ట్ కేసు

First Bird flu case in human: బీజింగ్: కరోనావైరస్‌ని ప్రపంచానికి పంచి పెట్టి యావత్ ప్రపంచం తలకిందులయ్యేలా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలోనే మరో వింత కేసు నమోదైంది. ఇప్పటివరకు కోళ్లు, పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ తొలిసారిగా చైనాలో ఓ వ్యక్తికి సోకింది. చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో మనిషికి బర్డ్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్ సోకితే ఎలాంటి లక్షణాలు (bird flu symptoms in humans) కనిపిస్తాయనే కోణంలో నెటిజెన్స్ గూగుల్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2021, 05:54 AM IST
Bird flu in human: చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ.. మళ్లీ చైనాలోనే ఫస్ట్ కేసు

First Bird flu case in human: బీజింగ్: కరోనావైరస్‌ని ప్రపంచానికి పంచి పెట్టి యావత్ ప్రపంచం తలకిందులయ్యేలా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలోనే మరో వింత కేసు నమోదైంది. ఇప్పటివరకు కోళ్లు, పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ తొలిసారిగా చైనాలో ఓ వ్యక్తికి సోకింది. సాధారణంగా పక్షి జాతిలోనే కనిపించే బర్డ్ ఫ్లూ వైరస్ ఈసారి మనిషికి సోకడం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. బర్డ్ ఫ్లూకి కారణమయ్యే హెచ్‌10ఎన్‌3 (H10N3) స్ట్రెయిన్‌‌తో ఓ వ్యక్తి బాధపడుతున్నట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. 

చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ సోకిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్‌ వెల్లడించింది. కోళ్ల నుంచి ఆ వ్యక్తికి వైరస్ (Bird flu from birds to humans)  ఎలా సోకిందనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. తొలిసారిగా ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకడాన్ని తీవ్రంగా పరిగణించిన చైనా వైద్య ఆరోగ్య శాఖ వెంటనే బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన సదరు వ్యక్తికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్యంలో మార్పులను పరిశీలిస్తోంది. 

Also read : New Strain China : చైనాలో మరో కొత్త స్ట్రెయిన్, సర్వత్రా ఆందోళన

కరోనావైరస్ (COVID-19 in china) ఒకరి నుంచి మరొకరికి సోకి అల్లకల్లోలం చేసిన నేపథ్యంలో అతడు గత కొద్ది రోజులుగా ఎవరెవరిని కలిశాడు.. వాళ్ల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే కోణంలోనూ చైనా ఆరోగ్య శాఖ దృష్టిసారించింది. చైనా తెచ్చిన కరోనా వైరస్ కష్టాల నుంచి ప్రపంచ దేశాలు ఇంకా తేరుకోకముందే జరిగిన ఈ ఘటన (Bird flu in China) మరోసారి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 

చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో మనిషికి బర్డ్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్ సోకితే ఎలాంటి లక్షణాలు (bird flu symptoms in humans) కనిపిస్తాయనే కోణంలో నెటిజెన్స్ గూగుల్ చేస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఒకవేళ మనిషికి బర్డ్ ఫ్లూ సోకినా.. వారిలో కనిపించే బర్డ్ ఫ్లూ లక్షణాలు జాబితాలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలే ఉన్నాయి. కరోనావైరస్ (COVID-19) నుంచి కోలుకోని ప్రపంచానికి చైనా ఇలా షాకుల మీద షాకులు ఇస్తోంది.

Also read: Hybrid Corona: ఇది మరీ ప్రమాదకరం, వియత్నాంలో ప్రారంభమైన హైబ్రిడ్ కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News