Green Fungus: కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలు అన్నీ ఇన్నీ కావు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కాదు..గ్రీన్ ఫంగస్ కొత్తగా చేరింది ఆ కోవలో..లక్షణాలేంటనేది తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి (Corona Pandemic) నుంచి కోలుకున్న తరువాత కూడా వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ స్థానంలో ఇప్పుడు గ్రీన్ ఫంగస్ వేధిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఎక్కువగా కన్పిస్తున్న వ్యాధులివి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా అవుతున్నాయి. మ్యూకోర్‌మైకోసిస్‌గా (Mucormycosis) పిలుస్తున్న ఈ ఫంగస్ కేసులు దేశంలో కలవరపెడుతున్నాయి. బ్లాగ్, వైట్ ఫంగస్‌లతో అల్లాడుతుండగానే దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ఫంగస్ (Green Fungus) వెలుగు చూసింది.
ఈ ఫంగస్ అసలు పేరు ఆస్పర్ గిలోసిస్. ముందుగా ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తిలో ఈ ఫంగస్‌ను కనుగొన్నారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్(Black Fungus) సోకిందనే అనుమానంతో వైద్యులు పరీక్షలు చేయగా..అది గ్రీన్ ఫంగస్ అని తేలింది. రక్తంలోనూ, ఊపిరితిత్తుల్లోనూ ఇది విస్తరించింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ముక్కు నుంచి రక్తం కారుతుండటంతో పరీక్షలు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ వ్యక్తి బరువు తగ్గి బలహీంగా మారాడు. చికిత్స పొందుతున్నాడు. ముక్కు నుంచి రక్తం కారడం, తీవ్రజ్వరం, బరువు తగ్గడం, వీక్నెస్ ఈ ఫంగస్ లక్షణాలుగా (Green Fungus Symptoms) ఉన్నాయి.
Also read: UAN-Aadhar Linking: ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగించిన EPFO
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook