Edible Oils: గుడ్‌న్యూస్, వంట నూనె ధరలు భారీగా తగ్గింపు

Edible Oils: వంటనూనెలు, పెట్రోలియం ధరల పెరుగుదల గత కొద్దికాలంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులు పడ్డ వినియోగదారులకు ఇప్పుడు ఊరట లభించనుంది. ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 17, 2021, 12:28 PM IST
Edible Oils: గుడ్‌న్యూస్, వంట నూనె ధరలు భారీగా తగ్గింపు

Edible Oils: వంటనూనెలు, పెట్రోలియం ధరల పెరుగుదల గత కొద్దికాలంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులు పడ్డ వినియోగదారులకు ఇప్పుడు ఊరట లభించనుంది. ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

ఓ వైపు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, మరోవైపు వంట నూనెల ధరలు (Edible Oil Prices) సగటు మనిషిని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులు పడిన వినియోగదారులకు ఊరట లభించింది. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 8 నుంచి 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ (Union Finance Ministry)వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొత్త రేట్లు జూన్ 17 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని టన్నుకు  87 డాలర్లు తగ్గి  1136 కు తగ్గించగా, ముడి సోయా చమురు దిగుమతి సుంకం టన్నుకు 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 1415  డాలర్లుగా ఉంది. అటు ఆర్బిడి పామాయిల్‌పై టన్నుకు 1148 డాలర్లకు తగ్గింది. తాజా తగ్గింపుతో  దేశీయంగా ఆవాలు, సోయాబీన్​, వేరుశనగల రేట్లు ఇలా మారనున్నాయి. 

పామాయిల్  పాత ధర 141 రూపాయలు కాగా..19 శాతం తగ్గి 115 రూపాయలకు చేరింది. పొద్దు తిరుగుడు నూనె (Sunflower oil) పాత ధర 188.16 రూపాయలు కాగా..16 శాతం తగ్గి 157 రూపాయలకు చేరింది. ఇక సోయా నూనె పాత ధర 162 రూపాయలకు కాగా..15 శాతం తగ్గడంతో 138 రూపాయలకు చేరింది. ఆవ నూనె పాత ధర 175 రూపాయలు కాగా..10 శాతం తగ్గుదలతో 157 రూపాయలకు చేరింది. వేరు శెనగ నూనె ( Ground nut oil) పాత ధర 190 రూపాయలు కాగా..8 శాతం తగ్గడంతో 174 రూపాయలకు చేరింది. వనస్పతి నూనె పాత ధర 184 రూపాయలు కాగా..8 శాతం తగ్గడంతో 141 రూపాయలకు చేరింది. 

Also read; India COVID-19 Cases: అన్‌లాక్ ఎఫెక్ట్, ఇండియాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News