Adbhutham Movie 1st Look Poster: తేజ సజ్జ మరో మూవీ మొదలెట్టేశాడు, ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతం

Adbhutham Movie 1st Look Poster: సమంత కీలకపాత్ర పోషించిన ఓ బేబీ సినిమాతో తేజ సజ్జ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆపై జాంబిరెడ్డి సినిమాలో నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2021, 04:35 PM IST
  • బాల నటుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న చిచ్చరపిడుగు తేజ సజ్జ
  • జాంబి రెడ్డి తరువాత ఇటీవల హనుమాన్ సినిమా మొదలుపెట్టిన నటుడు
  • తాజాగా మ‌ల్లిక్ రామ్ దర్శకత్వంలో అద్భుతం సినిమా మొదలుపెట్టిన తేజ
Adbhutham Movie 1st Look Poster: తేజ సజ్జ మరో మూవీ మొదలెట్టేశాడు, ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతం

Adbhutham Movie 1st Look Poster: బాలనటుడిగా టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ఆపై కొంతకాలం సినిమాలకు దూరమైన తేజ చదువు పూర్తిచేసుకుని మళ్లీ సినిమా ట్రాక్‌లోకి వచ్చాడు. అందులోనూ చిన్నప్పుడే ఎంతో ధైర్యంగా కెమెరాను ఫేస్ చేశాడు.

సమంత కీలకపాత్ర పోషించిన ఓ బేబీ సినిమాతో తేజ సజ్జ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆపై జాంబిరెడ్డి సినిమాలో నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక వరుస సినిమాలు చేయడానికి సిద్ధమైన తేజ లేటెస్ట్ సినిమా అప్‌డేట్ వచ్చింది. ఇదివరకే జాంబిరెడ్డి డైరక్టర్ ప్రశాంత్ వర్మతో హనుమన్ సినిమా మొదలుపెట్టిన తేజ తాజాగా మరో ప్రాజెక్టుకు సంతకం చేశాడు. మ‌ల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమా టైటిల్ ‘అద్భుతం’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Actor Nani) రిలీజ్ చేశాడు.

Also Read: RRR Poster Editing Photos: ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ క్రేజ్ చూశారా, ఓ రేంజ్‌లో ఎడిటింగ్ చేసిన ఫ్యాన్స్

తేజ సజ్జకు జోడీగా టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ నటిస్తోంది. అద్భుతం సినిమాను చంద్రశేఖ‌ర్ మొగుళ్ల నిర్మిస్తున్నారు. నాని తన వంతుగా తేజ సినిమా అద్భుతం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించాడు. ఈ పోస్టర్ చూసినవారంతా నిజంగానే అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే మూవీ యూనిట్ మరిన్ని వివరాలు త్వరలోనే అందించడానికి సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది నుంచి సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పలుమార్లు వాయిదా పడ్డాయి. దీంతో అవకాశం దొరికిన వెంటనే వరుస ప్రాజెక్టులకు నటీనటులు సిద్ధమవుతున్నారు.

Also Read: Narappa Movie: వెంకటేశ్ నటింటిన నారప్ప విడుదల అమెజాన్ ప్రైమ్‌లోనే..ఎప్పుడంటే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News