Rajinikanth Quits Politics | దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై ఉన్న వదంతులకు చెక్ పెట్టారు. రజనీ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారా అనే అంశంపై గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని (Rajinikanth dont have plans to enter politics) రజనీకాంత్ స్పష్టం చేశారు
రాజకీయాల్లోకి రావడానికి రజనీ మక్కల్ మండ్రం పార్టీని సైతం కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే తన ఆరోగ్య కారణాలతో పలుమార్లు రజనీ రాజకీయ అరంగేట్రం వాయిదా వేస్తూ వచ్చారు. నేటి ఉదయం తన అభిమాన సంఘాలతో భేటీ సందర్భంగా రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనే అంశంపై చర్చించారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాకూడదని రజనీకాంత్ (Rajinikanth) నిర్ణయం తీసుకున్నారు. తన అభిమాన సంఘాలకు స్పష్టత ఇచ్చిన అనంతరం మీడియా ముందుకొచ్చారు. భవిష్యత్తులోనూ తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. దీంతో రజనీ రాజకీయ అరంగ్రేటం జరగక ముందే పాలిటిక్స్ నుంచి సూపర్‌స్టార్ తప్పుకున్నట్లయింది.
"I don't have plans to enter politics in future," says actor Rajinikanth, dissolves Rajini Makkal Mandram pic.twitter.com/updoKb5HnY
— ANI (@ANI) July 12, 2021
రజనీ మక్కల్ మండ్రం పార్టీని ఆయన రద్దు చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. అయితే దీనిని కేవలం ఫ్యాన్స్ క్లబ్‌గా మాత్రం కొనసాగిస్తానని చెప్పారు. అన్నాతే సినిమా షూటింగ్ సమయంలోనూ అనారోగ్యానికి గురైన సూపర్‌స్టార్ అమెరికాకు వెళ్లి చికిత్స వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకున్నారని తెలిసిందే. ఇటీవల Tamil Nadu అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో అయిదేళ్ల తరువాత ఆరోగ్యం ఎలా ఉంటుందోనన్న కారణాలతో పాలిటిక్స్‌కు రజనీ గుడ్ బై చెప్పేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook