Covid19 Vaccine: భారీగా వ్యాక్సిన్ కొనుగోలు, 2-3 నెలల్లో మరో 66 కోట్ల వ్యాక్సిన్ డోసులు

Covid19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ కొనుగోలు జరుగుతోంది. మరో 2-3 నెలల్లో 66 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇండియాకు చేరనున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2021, 01:20 PM IST
Covid19 Vaccine: భారీగా వ్యాక్సిన్ కొనుగోలు, 2-3 నెలల్లో మరో 66 కోట్ల వ్యాక్సిన్ డోసులు

Covid19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ కొనుగోలు జరుగుతోంది. మరో 2-3 నెలల్లో 66 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇండియాకు చేరనున్నాయి.

ఇండియాలో ఇప్పటివరకూ దాదాపు 40 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. దేశంలో వ్యాక్సిన్(Vaccine)కొరత నేపధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం లేదు. దేశంలో అందుబాటులో ఉన్న రెండు రకాల వ్యాక్సిన్లు కోవిషీల్డ్(Covishield), కోవాగ్జిన్‌ల  ఉత్పత్తి సామర్ధ్యం పెంచేందుకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతున్నాయి. మరో 2-3 నెలల్లో ఆగస్టు-డిసెంబర్ మధ్యలో 66 కోట్ల డోసుల కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులు ఇండియాకు చేరనున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం(Central government)సంబంధిత కంపెనీలకు ఆర్డర్ పెట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum institute) నుంచి 37.5 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు, భారత్ బయోటెక్ నుంచి 28.5 కోట్ల కోవాగ్జిన్ డోసులు రానున్నాయి.కేంద్రం కొనుగోలు చేసిన ధరల ప్రకారం కోవిషీల్డ్ ఒక్కొక్క డోసు 205 రూపాయలు కాగా, కోవాగ్జిన్ (Covaxin) 215 రూపాయలుగా ఉంది. పన్నులతో కలిపి కోవిషీల్డ్ 215 రూపాయలు కాగా..కోవాగ్జిన్ 225 రూపాయలుగా ఉంది. 

Also read: Danish Siddique: దానిష్ సిద్ధీఖ్ మరణానికి కారణం తాము కాదంటున్న తాలిబన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News