Summer Climate: ఎండాకాలాన్ని తలపించే ఎండలు. కుండపోతగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. ఈ పరిస్థితి కారణమేంటి..ఇంకెన్ని రోజులు ఎండలు భరించాలి. వాతావరణ శాఖ ఏం చెబుతోంది.
జూలై నుంచి అక్టోబర్ వరకూ వర్షాకాలం. ఆగస్టులో అయితే విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురవాల్సిన పరిస్థితి. కానీ పరిస్థితి అలా లేదు. వర్షాలు కాదు కదా..ఎండలు మండిపోతూ..వేసవిని తలపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతగా జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనుకూలంగా లేదు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వీచే గాలులు బలహీనపడటం, నైరుతి, పశ్చిమ దిశగా వీయాల్సిన గాలుల్లో తేమ లేకపోవడంతో ఈ విచిత్ర పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ (IMD)చెబుతోంది. సాధారణంగా పాకిస్తాన్ నుంచి వీచే గాలులు బంగాళాఖాతం మీదుగా అరేబియా సముద్రం వైపుకు వెళ్లాలి గానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడే వర్షాలు కురుస్తాయి. అటు అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి వర్షాలకు అనువుగా ఉంటుంది. అయితే బంగాళాఖాతం (Bay of Bengal)సముద్రాన్ని తాకకుండానే అరేబియా సముద్రంవైపుకు వెళ్లిపోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవక, ఎండలు మండిపోతున్నాయని వాతావరణ శాఖ వివరించింది. అందుకే మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో ఇప్పుడు 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. గాలిలో తేమ లేకపోవడంతో రాష్ట్రమంతా వేడి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి మరో వారం రోజులు కొనసాగే అవకాశముందని ఐఎండీ(IMD)హెచ్చరించింది. అంటే ఈ నెల 13వ తేదీ వరకూ పరిస్థితి ఇలాగే ఉండి..ఆ తరువాత మారవచ్చని తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో ఈ సమయంలో ఉండే ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది. మరో వారం రోజులు అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత (High Temperatures)నమోదు కావచ్చని తెలుస్తోంది.
Also read: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో కీలక పనులు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
వేసవిని తలపిస్తున్న ఎండలు, మరో వారం రోజులు తప్పదంటున్న వాతావరణ శాఖ