భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడి చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం పేరు "ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన" (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana). దీనిని "పీఎం ఎస్‌వైఎం" (PM SYM) అని కూడా అంటారు.
Also Read: Gandhi Hospital: గాంధీలో గ్యాంగ్ రేప్.. అక్కా- చెల్లెలపై 5 గురు అత్యాచారం
ఇదొక పెన్షన్ పతకం (Pension scheme), పేదలను, ఆదాయం తక్కువగా ఉన్న కార్మికులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం "ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన" (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) పథకానికి శ్రీకారం చుట్టింది. 18సంవత్సరాల వయసు గల వారి నుండి 40 సంవత్సరాల వయసు గల వారు ఈ పథకానికి అర్హులు. పథకాన్ని ఎనుకున్న వ్యక్తి/ వ్యక్తురాలు వయసును బట్టి మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది.
ఈ పథకంలో మీరు నెలకు రూ.55 చెల్లిస్తే 60 సంవత్సరాలు దాటిన తరువాత నెలకు రూ. 3 వేల చొప్పున సంవత్సరానికి 36 వేల రూపాయలు మీకు లభిస్తాయి. అన్ని రకాల సాధారణ సేవా కేంద్రాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు అంతేకాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రాలలో ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
Also Read: T20 World Cup: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. పాక్ తో భారత్ మ్యాచ్ ఎప్పుడంటే..!
ఉదాహరణకు.... 18 ఏళ్ల వ్యక్తి/ వ్యక్తురాలు ప్రతి నెల రూ.55 ఈ పథకంలో జమచేస్తే.. ఆ వ్యక్తి 60 ఏళ్ల దాటిన తరువాత ప్రతి నెల 3 వేల రూపాయల పెన్షన్ పొందుతారు, అంతే సంవత్సరానికి 36 వేల రూపాయల పెన్షన్ పొందవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడి చేసుకునే వారికి ఇదొక మంచి అవకాశామనే చెప్పాలి. ఈ పథకంలో చేరాలంటే ఆధార్ కార్డు (Aadhar card) తో పాటు, బ్యాంక్ ఖాతా తప్పనిసరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook