Corona Third Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితులు ఇప్పుడిప్పుడే తొలగుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ భయం పొంచి ఉన్న నేపధ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చేసిన ప్రకటన ఆందోళన రేపుతోంది.
కరోనా మహమ్మారి (Corona Pandemic)ప్రస్తుతం దేశంలో స్థిరంగా కొనసాగుతోంది. రోజుకు 35 వేల కేసులు దాదాపుగా నమోదవుతున్న పరిస్థితి. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అటు కేరళలో కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, బెంగళూరులో చిన్నారులు ఎక్కువగా ప్రభావితం కావడంతో కరోనా థర్డ్‌వేవ్ భయం నెలకొంది. ఈ తరుణంలో ఎన్ఐడీఎం నిపుణుల కమిటీ చేసిన ప్రకటన ఆందోళన కల్గిస్తోంది.
దేశంలో అక్టోబర్ నెలలో కరోనా థర్డ్‌వేవ్ రానుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM)నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది ఎన్ఐడీఎం. చిన్నారుల వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించింది. కరోనా థర్డ్‌వేవ్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని ఈ నివేదిక వెల్లడించింది. దేశంలో వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని ఎన్ఐడీఎం నిపుణులు తెలిపారు. దేశంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉందని..కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలున్నాయని నివేదికలో పొందుపరిచారు. కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ ఖాళీల భర్తీ చేయాలని సూచించింది.
Also read: EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త, మార్చ్ 2022 వరకూ అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook