Muscle stretch for health : మన శరీరం చేసే ప్రతి పనికి కండరాల (muscles) సాయం అవసరం. మనం కదలాలన్న, నడవాలన్నా, పరుగెత్తాలన్నా, బరువులు ఎత్తాలన్నా ఇలా ఏ పనికైనా కండరాలే కావాలి. కండరాలు మృదువుగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే మన కీళ్లు ఏ కోణంలోనైనా తేలికగా కదలగలుగుతాయి. అలా కదిలితేనే మనం ఏ పనైనా చాలా సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కండరాలు (muscles) ఏమాత్రం బిగువైనా సరే కీళ్ల నొప్పులు, (Arthritis) కండరాలు పట్టేయటం, కండరాలు దెబ్బతినటం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరి ఇలాంటి సమస్యలు వస్తే చాలా సులభంగా మనం వాటిని అధిగమించవచ్చు. కండరాల సాగదీత వ్యాయామాలు (exercises) ఇందుకు బాగా ఉపయోగపడతాయి. స్ట్రెచింగ్ (stretching) వల్ల కండరాలకే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
గుండెకు ఎంతో మంచిది
మన శరీరంలో ముఖ్యమైన కండరాలన్నింటినీ కనీసం వారానికి రెండు, మూడు సార్లయినా సాగదీయాలి. అలా అని కండరాలను మరీ ఎక్కువగా సాగదీయాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు వంచినా చాలు. మామూలుగా మనం నిల్చున్నప్పుడు కాళ్లు 30 డిగ్రీల కోణంలో వెనకకు వంగేలా తుంటి కీళ్లు మృదువుగా కదిలితే చాలు. ఇందుకు రోజుకు కాసేపు సాగదీత వ్యాయామాలు చాలు. రోజువారీ పనులు తేలికగా చేసుకోవటానికివి సరిపోతాయి. గుండె సామర్థ్యాన్ని (heart capacity)పెంచేవి ఏరోబిక్ వ్యాయామాలే. కండరాలు, కీళ్లు మృదువుగా కదిలేలా చేసే సాగదీత వ్యాయామాలూ (aerobic exercise) గుండెకు మేలు చేస్తాయి. కండరాల, కీళ్ల బిగువు గుండె ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శరీర కదలికలు కష్టమైనవారిలో గుండె రక్తనాళాలు సైతం బిగువుగా ఉంటున్నట్టు జపాన్ పరిశోధకులు గుర్తించారు. కింద కూర్చొని పైకి లేవటానికి ఇబ్బంది పడేవారిలో.. భుజం, (shoulder)చేతి కీళ్ల కదలికలు తగ్గినవారిలో రక్తనాళాల (Vascular) బిగువు చాలా ఎక్కువగా ఉంటున్నట్టూ తేలింది. అంటే సాగదీత ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చనే ఇవి సూచిస్తున్నాయి.
ఈ సాగదీతలతో ఎంతో మేలు
పిక్క సాగదీత:
గోడకు ఎదురుగా కాస్త దూరంగా నిల్చోవాలి. గోడకు చేతులు ఆనించి ఒక పాదాన్ని ముందుకు తెచ్చి, మోకాలును వంచాలి. రెండో కాలు తిన్నగా ఉండాలి. రెండు పాదాలూ (feet) ముందు వైపు చూస్తుండాలి. చేతుల మీద శరీర బరువును మోపుతూ పిక్క కండరాలు వీలైనంత సాగేంతవరకు ముందుకు వంగాలి. 20-30 సెకన్ల పాటు అలాగే ఉండాలి. రెండో కాలుతోనూ ఇలాగే చేయాలి.
Also Read : Nose Hair Waxing effects : ముక్కులో వెంట్రుకలు తీసేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే
ఛాతీ, భుజం సాగదీత: (Chest, shoulder stretching)
మోచేతులను వంచి ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్లలో జోడించాలి. చేతులను తల వెనకకు తీసుకురావాలి. మోచేతులను నెమ్మదిగా వెనక్కు నెట్టి భుజాలు గట్టిగా బిగించాలి. తలకు కాస్త ఎత్తుగా ఉండేలా చేతులను లేపొచ్చు కూడా. దీన్ని కూర్చొని, నిల్చొని చేయొచ్చు.
సేతు బంధాసనం (setu bandhasana)
వెల్లకిలా పడుకొని, పాదాలను నేలకు తాకించి, మడమలను పిరుదుల వద్దకు తెస్తూ మోకాళ్లను పైకి లేపాలి. అరచేతులతో మడమలను పట్టుకొని, కడుపును కాస్త బిగపట్టి.. భుజాలను, తలను (head)నేలకు అదుముతూ తొడలు, నడుము, ఛాతీని వీలైనంత వరకు పైకి లేపాలి. కొద్ది సెకన్ల పాటు అలాగే ఉండి మళ్లీ మామూలు స్థితికి రావాలి.
భుజంగాసనం (bhujangasana)
బోర్లా పడుకొని, అరచేతులను భుజాల (shoulder) పక్కన నేలకు తాకించాలి. శ్వాసను తీసుకుంటూ.. చేతులను నేలకు అదుముతూ.. ఛాతీని (chest) తలను పైకి లేపాలి. 15-30 సెకన్ల పాటు అలాగే ఉండాలి. ఇవన్నీ చేస్తే కండరాల (muscles) పటుత్వం పెరుగుతుంది.
Fish Egg Benefits : చేప గుడ్ల ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook