MS Dhoni among Amrapali homebuyers who are yet to pay their dues: ఆమ్రపాలి హౌజింగ్‌ బకాయిదారుల్లో ధోని పేరు, డబ్బు చెల్లించకపోతే వేలం తప్పదు

MS Dhoni's name appears in list of Amrapali homebuyers : ధోని గతంలో ఆయన ఆమ్రపాలి హౌజింగ్‌ ప్రాజెక్ట్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించారు. దాంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇక తాజాగా ధోని పేరు మరోసారి తెరపైకి వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2021, 02:50 PM IST
  • ఆమ్రపాలి రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌నకు ప్రచారకర్తగా పని చేసిన ధోని
  • ప్రాజెక్ట్‌ నిర్వాహణ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు
  • నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్న ఎన్‌బీసీసీ
MS Dhoni among Amrapali homebuyers who are yet to pay their dues: ఆమ్రపాలి హౌజింగ్‌ బకాయిదారుల్లో ధోని పేరు, డబ్బు చెల్లించకపోతే వేలం తప్పదు

MS Dhoni, over 1,800 Amrapali Homebuyers Asked to Clear Outstanding Dues within 15 Days: భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni) అప్పడప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆయన పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా (Brand Ambassador) వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు ఆ బ్రాండ్‌ల వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్నారు ధోని. గతంలో ఆయన ఆమ్రపాలి హౌజింగ్‌ ప్రాజెక్ట్స్‌కు (Amrapali housing projects) అంబాసిడర్‌గా వ్యవహరించారు. దాంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇక తాజాగా ధోని పేరు మరోసారి తెరపైకి వచ్చింది. 

ఆమ్రపాలి హౌజింగ్‌ ప్రాజెక్ట్‌లోని కస్టమర్‌ డేటాలో ఇప్పటి వరకు బకాయిలు చెల్లించని వారిలో ఎంఎస్‌ ధోనీ కూడా ఉన్నారు. ధోనీతో పాటు ప్లాట్‌ల బకాయిల్ని చెల్లించని మరికొందరికి సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలనుసారం 15 రోజుల గడువు ఇచ్చారు. ఆ సమయంలో డబ్బులు కడితే ఒకే లేదేంటే ఒప్పందం రద్దు కావడంతో పాటు ప్లాట్‌లను వేలం వేయనున్నారు.

Also Read : Sai dharam tej accident case: సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు.. CCTV visuals పరీశీలన

2016 వ‌ర‌కు ధోనీ ప్రచారకర్త

ఆమ్రపాలి రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వ‌ర‌కు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్వాహణ ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు స్వయంగా రంగంలోకి దిగింది. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతల్ని ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేసే సంస్థ ఎన్‌బీసీసీకి అప్పగించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆమ్రపాలి హౌజింగ్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది ఎన్‌బీసీసీ (National Buildings Construction Corporation Ltd). ఈ మేరకు ఎన్‌బీసీసీ ధోనీతో పాటు మొత్తం 1800 మందికి నోటీసులు జారీ చేసింది. అందరూ గడువులోగా బకాయిలు చెల్లించి ప్రాజెక్టు పూర్తి అయ్యేలా సహకరించాలని కోరింది. 

డిఫాల్టర్‌లుగా గుర్తిస్తాం

కోర్టు ఆదేశాల ప్రకారం పూర్తి బకాయిలు చెల్లింపునకు 15 రోజుల గడువు ఇస్తున్నామని తెలిపింది. లేని పక్షంలో వాళ్లను డిఫాల్టర్‌లుగా గుర్తిస్తామని, తర్వాత వారికి సంబంధించిన ప్లాట్‌లను అమ్ముడుపోని జాబితాలో చేరుస్తామని నోటిసుల్లో పేర్కొంది. అలాగేఎలాట్‌మెంట్‌ను రద్దు చేసి వేలం వేస్తామని హెచ్చరించింది ఎన్‌బీసీసీ.  నొయిడాలోని సాప్పైర్‌ ఫేజ్‌-1లోని పెంట్‌ హౌజ్‌ కోసం కోటిన్నరకుగానూ ఇదివరకే ఇరవై లక్షలు ధోనీ చెల్లించారు. ధోనీ (Dhoni)ఆమ్రపాలి హౌజింగ్‌ ప్రాజెక్ట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తక్కువ ధరకే ప్లాట్‌లను ధోనీకి అప్పగించారు. అలాగే ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు 37 కోట్ల రూపాయల్ని చెల్లించారు.

Also Read : RBI New Rules: మీ అక్కౌంట్ నుంచి ఇకపై ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News