Jio Phone Next: టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్‌ఫోన్(Smart phone)ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ వినాయక చవితి రోజు విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాలతో దీపావళికి వాయిదా వేసింది రిలయన్స్. ఫోన్ ధర ఎంతనో క్లారిటీ లేకపోయినా ఐదువేల రూపాయలలోపే ఉండే అవకాశం ఉందని ఇప్పటికే టెక్ నిపుణులు వెల్లడించారు.
తాజాగా మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. సెమీ కండక్టర్ల (semi conductors)కొరత కారణంగా ఈ ఫోన్ ధర మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ కారణంగా రిలయన్స్ జియో(Reliance Jio)కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. గూగుల్-జియో ఆధ్వర్యంలో వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో ఫోన్(Jio Phone)..దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫోన్ విడుదల వాయిదా వేయడంతో ధర మరింత పెరగనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Zoom App: జూమ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్ ..12 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్! ఎలాగో తెలుసా..?
నివేదిక ప్రకారం..
ఈటి టెలికామ్ రిపోర్ట్ ప్రకారం..ఫోన్‌లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్) ధర సుమారు 20శాతం పెరిగింది. ఇక పెరిగిన ధరతో సెమీకండక్టర్ల లభ్యత లోటు 8 నుండి 20 వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్(Chip) ధరలతో జియో ఫోన్ పై ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ధరకే వచ్చే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఫోన్‌పై ఇంత ప్రచారం జరుగుతున్నా.. పూర్తి స్థాయిలో ఫోన్ అందుబాటులోకి తెస్తుందా? లేదంటే పరిమిత సంఖ్యలోనే విడుదల చేస్తుందా అన్న ప్రచారంపై జియో స్పందించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook