Ostrava Open: ఫైనల్లో అదరగొట్టిన భారత్ స్టార్ ప్లేయర్...43వ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న సానియా

Sania Mirza: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఈ ఏడాది తొలి టైటిల్‌ తన ఖాతాలో వేసుకుంది. చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరిగిన ఒస్ట్రావా ఓపెన్‌ డబ్ల్యూటీఏ-500 టోర్నీలో సానియా మీర్జా-షుయె జాంగ్‌ (చైనా) జంట విజేతగా నిలిచింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 04:25 PM IST
  • ఒస్ట్రావా ఓపెన్‌ లో సానియా జోడి సంచలనం
  • టైటిల్ కైవసం చేసుకున్న భారత్ స్టార్ ప్లేయర్
  • ఈ ఏడాది తొలి టైటిల్ సాధించిన సానియా
Ostrava Open: ఫైనల్లో అదరగొట్టిన భారత్ స్టార్ ప్లేయర్...43వ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న సానియా

Sania Mirza: భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా(Sania Mirza) సంచలనం సృష్టించింది. ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్‌ టైటిల్‌(Dobles Title)ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఒస్ట్రావా ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో చైనా భాగస్వామి షుయె జాంగ్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్‌ సానియా–ష్వై జాంగ్‌ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్‌ కైట్లిన్‌ క్రిస్టియన్‌ (అమెరికా)–ఎరిన్‌ రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జంటపై విజయం సాధించింది.

Also Read: World Archery Championship‌ 2021: చరిత్ర సృష్టించిన తెలుగు తేజం..మూడు రజత పతకాలతో సంచలనం

ఛాంపియన్‌గా నిలిచిన సానియా-షుయె జాంగ్‌ జోడీకి 25,230 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  ఈ విజయంతో 34 ఏళ్ల సానియా తన కెరీర్‌లో 43వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. చివరిసారి 2020 జనవరిలో హోబర్ట్‌ ఓపెన్‌లో నాదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి టైటిల్‌ నెగ్గిన సానియా ఖాతాలో చేరిన మరో డబుల్స్‌ టైటిల్‌ ఇదే కావడం విశేషం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News