Aadhaar card: ఏటీఎం కార్డు లాంటి ఆధార్ కోసం ఇలా అప్లై చేసుకోండి

Aadhaar card new form like ATM card in wallet Apply this way : ఇప్పటి వరకు ప్రింట్ వెర్షన్​లో పేపర్ ఆధార్ కార్డు మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దాన్నే మనలో కొందరు చిన్న సైజ్‌లో చేసుకుని ఉపయోగిస్తుంటాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2021, 04:56 PM IST
  • ఇప్పటి వరకు ప్రింట్ వెర్షన్​లో పేపర్ ఆధార్ కార్డు
  • ఆధార్‌‌కు కొత్త రూపునిచ్చిన యూఐడీఏఐ
  • ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్​
Aadhaar card: ఏటీఎం కార్డు లాంటి ఆధార్ కోసం ఇలా అప్లై చేసుకోండి

Aadhaar card will come in new form like ATM card in wallet Apply this way : మన దగ్గర ఎప్పుడూ ఉండేవాటిలో ఆధార్ కార్డు (Aadhaar card) కూడా ఒకటి. దాన్ని జేబులో లేదా పర్సులో ఎప్పుడూ మన వద్దే ఉంచుకుంటాం. ఇప్పటి వరకు ప్రింట్ వెర్షన్​లో పేపర్ ఆధార్ కార్డు (print version aadhar card) మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దాన్నే మనలో కొందరు చిన్న సైజ్‌లో చేసుకుని ఉపయోగిస్తుంటాం.అయితే ఆధార్‌‌కు కొత్త రూపునిస్తోంది యూఐడీఏఐ. 2021లో సరికొత్తగా పీవీసీ ఆధార్​ను ప్రవేశపెట్టింది. 

ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్​లను జారీ చేస్తోంది యూఐడీఏఐ (uidai). కేవలం రూ.50 చెల్లిస్తే ఈ పీవీసీ కార్డును మనం పొందవచ్చు. కార్డులో పేర్కొన్న అడ్రస్‌కే పీవీసీ ఆధార్​ కార్డును (pvc aadhar card) డెలివరీ అవుతుంది. మరి ఈ ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్​ కోసం చాలా సింప్లీ స్టెప్స్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read : MAA Elections 2021: మంచువిష్ణుకు బాలకృష్ణ మద్దతు

మొదట యూఐడీఏఐ వెబ్​సైట్​(https://myaadhaar.uidai.gov.in/)కి వెళ్లి లాగిన్ అవాలి. తర్వాత 'ఆర్డర్​ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి..తర్వాత రూ.50 చెల్లిస్తే చాలు. ఆధార్​ కార్డులో (Aadhaar card) ఉన్న అడ్రెస్​కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. ఇలా సింపిల్ స్టెప్స్‌తో ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్​ను పొందొచ్చు.

Also Read : అక్కడ కిలో ఉప్పు రూ.130, కిలో చక్కెర రూ.150..కారణం ఏంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News