Hyderabad Heavy Rains: ఆగకుండా కురిసిన వర్షానికి ఆగమైన రాజధాని.. Videos

శుక్రవారం కురిసిన వర్షానికి హైదరాబాద్ పూర్తిగా నీతితో మునిగిపోయింది.  ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు 040-21111111 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2021, 11:03 AM IST
  • తడిసి ముద్దయిన హైదరాబాదు నగరం
  • లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం
  • కొట్టుకు పోయిన వాహనాలు, రోడ్లన్నీ జలమయం
Hyderabad Heavy Rains: ఆగకుండా కురిసిన వర్షానికి ఆగమైన రాజధాని.. Videos

 Hyderabad Heavy Rains: శుక్రవారం రాత్రి  07.30 నుంచి 3 గంటల పాటు ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం మునిగిపోయింది. కురిసిన వర్షానికి నాళాలు ఉప్పొంగి, రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వాహనాలు కొట్టుకుపోవటమే కాదు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 

శుక్రవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రాజధాని పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సరిగ్గా నగర వాసులు పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయానికే వర్షం ప్రారంభమవటం, రోడ్లన్నీ జలమయం అవ్వటం కారణంగా ఎక్కడ రోడ్డు ఉందో... ఎక్కడ నాళాలు ఉన్నాయో తెలియక భయంగానే ఇంటికి చేరుకున్నారు నగర వాసులు.

Also Read: Cyclone at Bay of Bengal: కోస్తాంధ్ర తీరానికి తుపాను హెచ్చరిక

నాచారం, చంపాపేట, అత్తాపూర్ లలో వర్షపు నీరు నిలిచిపోగా, చంద్రాయణగుట్టలో చాలా ప్రాంతం వరకు నీటిలో మునిగిపోయింది. తీవ్రమైన వర్ష ప్రభావంతో విధ్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. 

నీట మునిగిన ప్రాంతాలు:
1) నాచారంలో - 6 సెం.మీ. 
2) శివరాంపల్లిలో-  6.6 సెం.మీ. 
3) రాజేంద్రనగర్‌ - 6.7సెం.మీ.  
4) అత్తాపూర్‌లో - 6.9 సెం.మీ. 
5) రెయిన్‌ బజార్‌లో - 7.7 సెం.మీ. 
6) బహదూర్‌పురాలో -  8.1 సెం.మీ. 
7) కంచన్‌బాగ్‌లో - 8.4 సెం.మీ. 

Also Read: Edible Oil Prices: దేశీయంగా తగ్గిన వంట నూనె ధరలు, కారణమేంటంటే

8) సరూర్‌నగర్‌లో - 8.6 సెం.మీ. 
9) మలక్‌పేటలో - 8.7 సెం.మీ.  
10)హస్తినాపురంలో - 8.8 సెం.మీ. 
11)లింగోజిగూడలో  - 10.6 సెం.మీ. 
12)కుర్మగూడలో - 10 సెం.మీ. 
13) మహేశ్వరంలో - 14 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధిక వర్షపాతం కురుసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

వర్షం కారణంగా రోడ్లపై నిలిచి ఉన్న నీటిని వీలైనంత త్వరగా తొలగించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇబ్బందులు పడేవారు 040-21111111 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News