Badvel Bypoll: బద్వేలు బరిలో 35 నామినేషన్లు, వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. మరోవైపు బద్వేలు ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బద్వేలు బరిలో ఇప్పటివరకూ దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2021, 02:36 PM IST
 Badvel Bypoll: బద్వేలు బరిలో 35 నామినేషన్లు, వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. మరోవైపు బద్వేలు ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బద్వేలు బరిలో ఇప్పటివరకూ దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad Bypoll) సమరం నడుస్తోంది. ఉపఎన్నికకు సంబంధించి కీలకమైన నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగిసింది. బద్వేలు బరిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులతో పాటు స్వతంత్ర్య అభ్యర్ధులు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బద్వేలు బరిలో మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. బద్వేలు ఉపఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు పరిశీలకులు కడపకు చేరుకున్నారు. మరోవైపు బద్వేలు ఉపఎన్నికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ అంజాద్ పాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, బద్వేలు అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపఎన్నికల ప్రచారం, ప్రణాళికలపై పోలింగ్ బూత్ స్థాయి నేతలతో సమావేశంలో చర్చించారు. బద్వేలు ఎన్నికల్లో(Badvel Bypoll) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది భారీ విజయం ఖాయమని పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ..కులం, మతం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోందన్నారు. 

Also read: Heroin Smuggling: హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో ఏపీకు సంబంధం లేదని నిర్ధారించిన డీఆర్ఐ నివేదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News