Salaar fighting scene leaked: సలార్ ఫైటింగ్ సీన్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Salaar fighting scene video leaked: ప్రభాస్ అంటేనే ఆరడుగులు ఆజానుబాహుడు. స్క్రీన్‌పై ప్రభాస్ కటౌట్ ప్రత్యక్షమైందంటేనే అభిమానులకు ఏదో తెలియని క్రేజ్. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఫ్యాన్స్ (Prabhas fans) , నెటిజెన్స్ షేర్ చేసుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 04:00 PM IST
  • Salaar fighing scene పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ వీడియో
  • సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ని పరేషాన్ చేస్తోన్న వరుస లీకులు
  • విక్రమాాదిత్య ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న Radhe Shyam teaser
Salaar fighting scene leaked: సలార్ ఫైటింగ్ సీన్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Salaar fighting scene video leaked: ప్రభాస్ లేటెస్ట్ సినిమాల అప్‌డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూసే అభిమానులకు దొరక్క దొరక్క ఓ ఫోటోనో లేక వీడియోనో దొరికితే వాటితో పండగ చేసుకోకుండా ఊరుకుంటారా ? ప్రస్తుతం సలార్ మూవీ విషయంలో అదే జరుగుతోంది. సలార్ మూవీ నుంచి ఓ ఫైటింగ్ సీన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి తెగ వైరల్ అవుతోంది. రౌడీల ముఠాను ప్రభాస్ గ్యాంగ్ తరిమి కొడుతున్నట్టుగా ఉన్న ఈ వీడీయోను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ప్రభాస్ అంటేనే ఆరడుగులు ఆజానుబాహుడు. స్క్రీన్‌పై ప్రభాస్ కటౌట్ ప్రత్యక్షమైందంటేనే అభిమానులకు ఏదో తెలియని క్రేజ్. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఫ్యాన్స్ (Prabhas fans) , నెటిజెన్స్ షేర్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సలార్ మూవీ ఫైటింగ్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Salar fighting scene leaked) అవుతోందని తెలుసుకున్న సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మూవీ యూనిట్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడట. అందుకు కారణం సలార్ మూవీ నుంచి ఇలా లీకులు రావడం ఇదేం తొలిసారి కాదు. 

ఇటీవలే సలార్ మూవీ సెట్స్ నుంచి ప్రభాస్ ఫోటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అవడంతో అప్పటి నుంచి షూటింగ్ లొకేషన్‌లో మొబైల్ ఫోన్స్ అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈలోగా మళ్లీ ఇలా ఇంకో వీడియో బయటికి రావడం (Salaar fighting video leaked) ప్రశాంత్ నీల్‌కి ప్రశాంతత కరువయ్యేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది.

Also read : Allu Arjun's wife Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పోస్ట్ చేసిన Maldives vacation video

ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తుండగా శృతి హాసన్ అతడి సరసన జంటగా నటిస్తోంది. సలార్ మూవీతో పాటు ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, ప్రజెక్ట్ K తో బిజీగా ఉన్నాడు.  అక్టోబర్ 23న ప్రశాంత్ బర్త్ డే కావడంతో ఆ రోజున రాధే శ్యామ్ టీజర్ (Radhe Shyam teaser updates) విడుదల చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. రాధే శ్యామ్ మూవీ టీజర్ విక్రమాదిత్య ఎవరు అనేది (Who is Vikramaditya) ద్వారా హింట్ ఇవ్వనున్నారు.

Also read : K3 Kotikokkadu Trailer: K3 కోటికొక్కడు ట్రైలర్.. ఇరగదీసిన Kichcha Sudeep

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x