నిరుద్యోగులకు భారీ పథకం; టి సర్కార్ కసరత్తు

తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు శుభావార్త

Last Updated : Feb 23, 2018, 03:05 PM IST
నిరుద్యోగులకు భారీ పథకం; టి సర్కార్ కసరత్తు

తెలంగాణ ప్రాంతం నిరుద్యోగులకు శుభవార్త..మిమ్మల్ని ఆదుకునేందుకు  తెలంగాణ సర్కార్ భారీ స్కీం ను ప్రవేశపెడుతోంది. ఆ దిశగా  కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ  ఆర్ధిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలుపై ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రతినెల రూ.2 వేలు చొప్పున నిరుద్యోగుల ఖాతాలో డబ్బులు జమా అయ్యేలా పథకం రూపొందిస్తున్నారు. అధికారుల కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేస్తారు. ఇదిలా ఉండగా అటు ఏపీలోనూ పథకం అమలుపై కసరత్తు జరుగుతోంది.

Trending News