Rajinikanth Dada Saheb Phalke: చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనకు దక్కడం పట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth News) మరోసారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డును సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీ అందుకోనున్నారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ రజనీకాంత్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ఒకే రోజున రెండు ఆనందించదగ్గ విశేషాలు జరగనున్నాయని అందులో పేర్కొన్నారు.
"రేపు నా జీవితంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయి. అందులో మొదటిది.. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నేను అందుకోనున్నాను. ఈ సందర్భంగా నాపై అభిమానులు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. రెండోవది.. నా కుమార్తె సౌందర్య విఘ్నేశ్ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన 'హూట్ యాప్'ను (Hoote App) రేపు నేను లాంచ్ చేయనున్నాను. సౌందర్య తన ప్రయత్నాలతో రూపొందించిన ఈ యాప్ ఎంతో మందికి ఉపయోగ పడనుంది. ఏ భాషాలోనైనా ప్రజలు తమ ఆలోచనలు, కోరికలను వాయిస్ ద్వారా వెల్లడించవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన యాప్‌ను లాంచ్ చేసేందుకు నేనెంతో ఆసక్తిగా ఉన్నాను" అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
మరోవైపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్ నెలలోనే కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.
'పెద్దన్న' టీజర్..
రజనీకాంత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం 'అన్నాత్తే' మూవీ తెలుగులో 'పెద్దన్న' అనే పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి ఈ మూవీ థియేటర్లలో (Peddanna Movie Release Date) సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో 'పెద్దన్న' టీజర్‌ను (Peddanna Teaser) శనివారం (అక్టోబరు 23) విడుదల చేశారు. టాలీవుడ్ హీరో వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ అయ్యింది.
Also Read: రజనీకాంత్ ‘పెద్దన్న’ టీజర్ అదిరింది.. ఫ్యాన్స్‌కు వెంకటేశ్ సర్ప్రైజ్
Also Read: 'ఎఫ్ 3' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.