Shyam Singha Roy promo: శ్యామ్ సింగ రాయ్ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో

Rise of Shyam Promo from Shyam Singha Roy: వచ్చే నెలలోనే శ్యామ్ సింగ రాయ్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2021, 06:53 PM IST
Shyam Singha Roy promo: శ్యామ్ సింగ రాయ్ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో

Rise of Shyam Promo from Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, క్రితి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. వచ్చే నెలలోనే శ్యామ్ సింగ రాయ్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా నవంబర్ 6న రిలీజ్ కానున్న సింగిల్‌కి సంబంధించిన ప్రోమోను మూవీ యూనిట్ విడుదల చేసింది. 

తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాను (Shyam Singha Roy movie) నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు.

Trending News