Ram Charan meets Puneeth Rajkumar’s family: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇటీవల పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శోక సంద్రంలో మునిగిన పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి తమ సానుభూతిని ప్రకటించి వారికి ధైర్యం చెప్పేందుకు కన్నడ సినీ పరిశ్రమ నుంచే కాకుండా తెలుగు, తమిళ, మళయాళం చిత్ర పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పునీత్ ఇంటికి వెళ్లి వస్తున్నారు. కష్టకాలంలో మీకు తోడుగా యావత్ దక్షిణాది సినీ పరిశ్రమ ఉంది అనే భావన వారికి కల్పించేందుకు సినీ ప్రముఖులు తమ వంతు కృషిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని కలిసి వారిని ఓదార్చారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు చేస్తోన్న రామ్ చరణ్ (Ram Charan, Shankar movie).. తాజాగా ఓ పాటకు సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేసుకుని వచ్చాడు. ఆ తర్వాతే ఇలా బెంగళూరు వెళ్లాడు.
పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంతో పాటు ఆయన సోదరుడు శివ రాజ్‌కుమార్‌ని కలిసిన రామ్ చరణ్ (Ram Charan meets Shiva Rajkumar).. మీ కుటుంబానికి ఈ కష్టాన్ని ఎదుర్కొనేంత ధైర్యం ఆ దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.