AP HIGH COURT: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖరలైన పిల్‌పై హైకోర్టు విచారణ నిర్వహించింది.
ఏపీ ప్రభుత్వం(Ap government) టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు వీలుగా జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ తిరుపతికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కన్నెగంటి లలితల ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ నిర్వహించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టంపై అభ్యంతరం చెప్పేందుకు ఏమీ లేదని వ్యాఖ్యానించింది. ఈ చట్టం పేరులో జ్యుడీషియల్ ఉన్నంత మాత్రాన..కోర్టులు నిర్వర్తించే విధులు నిర్వహిస్తున్నట్టు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పేరులో జ్యుడీషియల్ ఉంటే వచ్చిన నష్టమేముందని పిటీషనర్ను ప్రశ్నించింది. అయితే న్యాయశాఖ ఉండగా..రిటైర్డ్ న్యాయమూర్తి సలహాలు తీసుకోవడం ఏ మేరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
రాజ్యాంగంలో ఎక్కడా జ్యుడీషియల్ ప్రివ్యూ(Judicial Preview) పదం లేదని..రివ్యూ మాత్రమే ఉందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదన విన్పించారు. దీనిపై పూర్తిగా న్యాయస్థానాలపై అధికారముందన్నారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం స్పందించింది. జ్యుడీషియల్ అని ఉన్నంతమాత్రాన ఆ చట్టం కింద ఏర్పాటైన విశ్రాంత న్యాయమూర్తి కోర్టు విధుల్ని నిర్వర్తించరని గుర్తు చేశారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు ఏమీ లేదని హైకోర్టు( Ap High Court) తెలిపింది. వంద కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్ల ప్రక్రియను జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలిస్తుందన్నారు. టెండర్ల ప్రక్రియలో పూర్తి స్థాయి పారదర్శకత కోసమే ఈ విధానం ప్రవేశపెట్టామని..ఏ విధమైన చట్ట ఉల్లంఘనలు లేవని ప్రభుత్వం వాదించింది.
Also read: Petrol Prices in AP: పెట్రోల్ ధరలపై బీజేపీ, టీడీపీవి అసత్య ప్రచారాలు: సజ్జల రామకృష్ణా రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook