Nathan Lyon On India: ఇండియా - పాకిస్థాన్, ఇండియా - ఆస్ట్రేలియా, ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా సరే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో తలపడటం మినహా టీమ్‌ఇండియా, పాక్ జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. మరో వైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను వారి గడ్డపైనే ఓడించి మరీ టీమ్ఇండియా తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఇక మన స్టేడియాల్లో అయితే టీమ్‌ఇండియాకు తిరుగే ఉండదు. ఈ క్రమంలో మన దేశంలోనే టీమ్ఇండియాను ఆస్ట్రేలియా (India Vs Australia) ఓడించాలని.. ఆ జట్టులో తాను ఉండాలని కోరుకుంటున్నాడు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్. షెడ్యూల్ ప్రకారం అయితే గత అక్టోబర్‌లోనే ఆస్ట్రేలియా పర్యటన ఉండాల్సింది. అయితే ఐపీఎల్ (IPL 2021), టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup 2021) ఉండటం వల్ల పర్యటనను బీసీసీఐ వాయిదా వేసింది.
“టీమ్ఇండియాపై వారి గడ్డమీదే ఆస్ట్రేలియన్ టీమ్ గెలవాలి. ఆ జట్టులో నేను సభ్యుడిని కావాలి. ఇదే నాకున్న అతిపెద్ద లక్ష్యాల్లో ఒకటి. టెస్టు సిరీస్‌లో నేను కీలక పాత్ర పోషిస్తాననే నమ్మకం ఉంది’’ అని నాథన్ లియోన్ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో వంద టెస్టుల్లో ఆడిన నాథన్ 399 వికెట్లను పడగొట్టాడు. 400 వికెట్ల మైలురాయికి కేవలం ఒకే ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. గతేడాది టీమ్‌ఇండియా ఆసీస్ పర్యటనకు వెళ్లింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌లో లియోన్ మొత్తం 9 వికెట్లను మాత్రమే తీయగలిగాడు. వచ్చే డిసెంబర్ 8 నుంచి ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (England Vs Australia Ashes) మధ్య యాషెస్ సిరీస్ (ఐదు టెస్టులు) ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటి నుంచే లియోన్ సన్నద్ధమవుతున్నాడు.
Also Read: T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook