Jasprit Bumrah: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇండియా 1-3తో పరాజయం పాలైంది. ఇప్పుడు టీమ్ ఇండియా దృష్టి ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌పై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Team India: క్రికెట్ ప్రస్థానంలో టీమ్ ఇండియా ర్యాంకింగ్ పడిపోతోంది. గతమెంతో ఘనం అని చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో ర్యాంకింగ్ పడిపోవడం ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs AUS 3rd Test Playing 11: రెండో టెస్ట్‌లో దారుణంగా ఓటమి పాలైన భారత్.. మూడో టెస్ట్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. త్వరలో మహ్మద్ షమీ జట్టుతో చేరనుండంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. అయితే షమీ నాలుగో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Australia Tour Of India: గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా.. అవగింజ అదృష్టం ఉండాలంటారు. యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఇదే నిజమనిస్తోంది. మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నా అతనికి సెలెక్టర్ల నుంచి పిలుపు రావడం లేదు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Nathan Lyon On India: టీమ్ఇండియాను తమ స్వదేశంలోనే ఓడించాలనేది తనకు ఉన్న అతిపెద్ద లక్ష్యమని అంటున్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఇండియన్ టీమ్ ను తమ స్వదేశంలోనే ఆస్ట్రేలియా (India Vs Australia) ఓడించాలని.. అయితే ఆ జట్టులో తాను ఉండాలని కోరుకుంటున్నాడు.
India vs Australia Test Series Updates: వరుసగా రెండో పర్యాయం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా అజింక్య రహానే కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
India vs Australia Test Series: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పాసయ్యాడు. అదేనండీ.. ఐపీఎల్ 2020 సమయంలో గాయపడ్డ రోహిత్ శర్మ నేడు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తాను సిద్ధమేనని సంకేతాలిచ్చాడు. NCAలో ఫిజియోలు ఓపెనర్ రోహిత్ శర్మకు ఫిట్నెస్ సంబంధిత టెస్టులు నిర్వహించగా టెస్ట్ పాసయ్యాడు.
Ind vs Aus 2020 | ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. గాయం విషయం తెలుసుకోకుండా హిట్ మ్యాన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఆసీస్ టూర్‌కు జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. అయితే ఐపీఎల్ 2020లో రోహిత్ మళ్లీ క్రీజులోకి దిగడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన సెలెక్టర్లు ఆసీస్ పర్యటనలో రోహిత్ శర్మను భాగస్వామిని చేశారు.
ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ ఆడటానికి తమ జట్టు సిద్ధంగా ఉందని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. పెర్త్‌లో అయినా లేక గబ్బలో అయినా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్‌తో ఆడటానికి టీమిండియా సిద్ధంగా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టంచేశాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా రేపటి 4వ టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. అందులో 2 మ్యాచ్ లు గెల్చుకుని సిరీస్ లో పైచేయి సాధించింది. రేపటి నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే, సిరీస్ టీమిండియా వశమవడమేకాదు.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెల్చుకున్న టీమిండియా జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టించనుంది. బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీని..
నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ స్టేడియంలో జరిగిన 2వ టెస్ట్‌లో ఆసిస్ భారత్‌పై 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5వ రోజు లంచ్‌కి ముందే టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా వికెట్లు కోల్పోయి 140 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో అప్పటికే 146 పరుగుల ఆధిక్యంలో వున్న ఆసిస్ జట్టు అలవోకగానే భారత్‌పై గెలుపును సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నట్టుగా కనిపించిన కుర్రాళ్లు రిషబ్‌పంత్ (36 పరుగులు; 4X2 ,6X1), హనుమ విహారి (20 పరుగులు; 4X2) సైతం ఒకానొక దశలో ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.