TSRTC bus catches fire: టిఎస్‌ఆర్టీసీ బస్సులో మంటలు.. Wyra సమీపంలో ఘటన

RTC bus catches fire: ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. బస్సులో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 08:50 PM IST
  • ఒకే రోజు ఆర్టీసీ ప్రయాణికులను కలవరపాటుకు గురిచేసిన మూడు వేర్వేరు ఘటనలు
  • భద్రాచలం వెళ్తున్న బస్సులో మంటలు (Bus catches fire)
  • మరో ఘటనలో ఇద్దరు స్పాట్ డెత్
TSRTC bus catches fire: టిఎస్‌ఆర్టీసీ బస్సులో మంటలు.. Wyra సమీపంలో ఘటన

RTC bus catches fire: ఖమ్మం: జిల్లాలోని వైరా సమీపంలో టిఎస్ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న AP292610 గరుడ బస్సు వైరా సమీపంలోకి రాగానే మంటలు అంటుకున్నాయి. బస్సు వెనకాల పొగలు వస్తుండటం పసిగట్టిన ప్రయాణికులు డ్రైవర్‌ని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ వెంటనే బస్సును ఓ పక్కన నిలిపేయడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా కిందకు దిగారు. 

ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గరుడ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప్రమాదం నుంచి తామంతా బయటపడ్డామని ప్రయాణికులు (TSRTC passengers) ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలావుంటే, మరో ఘటనలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎంజీబీఎస్ నుంచి బయల్దేరి అంబర్‌పేట్ వద్దకు చేరుకోగానే ఆర్టీసీ డ్రైవర్‌కి గుండెపోటు (Cardiac arrest) వచ్చింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపేసి ప్రయాణికులను ప్రమాదం బారి నుంచి కాపాడారు. వెంటనే డ్రైవర్‌ని అంబులెన్సులో తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. 

Also read : LPG cylinder blasted: ఎల్పీజీ సిలిండర్ పేలి 17 మందికి గాయాలు, 5 ఇళ్లు ధ్వంసం

ఈ రెండు ఘటనలు ఇలా ఉండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు అన్నాదమ్ములు అక్కడిక్కడే మృతి చెందిన మరో ఘటన ఇవాళే హన్మకొండ జిల్లాలో ఐనవోలు సమీపంలో చోటుచేసుకుంది. టూ వీలర్‌పై (Two wheeler) వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములను ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇవాళ ఒక్క రోజే మొత్తం మూడు వేర్వేరు ఘటనలతో టిఎస్ఆర్టీసీ (TSRTC) ఇలా వార్తల్లో నిలిచింది.

Also read : Patan Girl Tonsured: ప్రేమికుడితో వెళ్లిపోయిన బాలికకు గుండుకొట్టించిన గ్రామస్థులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News