తమిళనాడు: భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు...నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి..

Tamilnadu: భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 02:26 PM IST
  • తమిళనాడులో కుండపోత వర్షాలు
  • భవనం కూలి 9 మంది మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్
తమిళనాడు: భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు...నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి..

Tamilnadu Rains: తమిళనాడును భారీ వర్షాలు(Heavy Rains in Tamilnadu) అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వెల్లూరు జిల్లా(Vellore district)లో ఇల్లు కూలి(house Collapse) తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉండటం విశేషం.

వివరాల్లోకి వెళితే...
వరద ముంచెత్తిన కారణంగా పెరనంపట్టు ప్రాంతంలో నివసిస్తున్న రెండు కుటుంబాలు.. ఇంటి దాబాపైకి వెళ్లారు. మొత్తం 17 మంది పైకి చేరుకున్నారు. ఈ వర్షాలకు అప్పటికే బలహీనంగా మారిపోయిన ఇల్లు (house collapse).. ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకోగా.. అగ్నిమాపక దళాలు, ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Also Read: అనంతపురం జిల్లా అతలాకుతలం.. చిత్రావతి నదిలో చిక్కుకున్న 8 మంది

ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌(CM Stalin) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తెల్లవారుజామున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News