Heavy downpour triggers flash floods across Anantapur district Ten People Trapped In Chitravathi River Helicopter Coming For Rescue: అనంతపురం జిల్లా వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ జేసీబీపై (JCB) 8 మంది దాకా చిక్కుకున్నారు. వారంతా ఉదయం నుంచీ చిగురుటాకుల్లా వణుకుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వరద (Floods) ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక బృందాలు వారిని రక్షించేందుకు వీలు కావడం లేదు. అధికారులు హెలికాప్టర్ ( Helicopter) సాయంతో వారిని రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హెలికాప్టర్‌ల ద్వారా తమను ఎప్పుడు కాపాడుతారో అంటూ బాధితులు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.
ఇక గత మూడు రోజుల నుంచి అనంతపురం జిల్లాలో (Anantapur district) భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు (Chitravati Balancing Reservoir) భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తివేసి 11 వేల క్యూసెక్కుల (Cusecs) నీటిని చిత్రావతి నది లోకి అధికారులు విడుదల చేశారు. గత మూడు రోజుల నుంచి అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కర్ణాటకలో (Karnataka) కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నదిలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం చిత్రావతి రిజర్వాయర్ నిండుకుండలా ఉంది. చిత్రావతి నది (Chitravati river) పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చిత్రావతి నదిలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో తిమ్మంపల్లి పులివెందుల రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read : 'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ
ఇక అనంతపురం జిల్లాలో (Anantapur District) గతంలో ఎప్పుడూ లేని విధంగా కదిరి సమీపంలో ఉన్న ఎర్రదొడ్డి గంగమ్మ నీట మునిగింది. మొదటిసారి గంగమ్మ తల్లి కనిపించకుండా పోయింది. నీటి ఉద్ధృతికి గుడి కనిపించలేదు. ప్రతి ఆదివారం వందలాది పొట్టేళ్లు గంగమ్మకు బలి ఇస్తుంటారు. కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మద్ది లేరు, సోమవతి నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో నీటి ప్రవాహం పోటెత్తింది. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది పూర్తిగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది రాకపోకలు నిలిచిపోయాయి. మడకశిర పట్టణం జలమయం అయింది.
కదిరి (Kadiri) పుట్టపర్తి (Puttaparthi) రహదారిలో వాహనాలను నిలిపివేశారు. కదిరి హిందూపురం ప్రధాన రహదారిపై కోనేరు వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చెరువులన్నీ ప్రమాదకర స్థితిలో పారుతున్నాయి. చెరువు సమీపంలో ఉన్న ఇళ్లల్లోకి నీళ్లు భారీగా వచ్చి చేరుతున్నాయి. దీంతో ప్రజలంతా పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నారు.
బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం కారణంగా అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు జిల్లాలో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read : కడప: చెయ్యేరు నదికి పోటెత్తిన వరద..30 మంది గల్లంతు..ముగ్గురు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook