Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల జగన్ పాలన డిజాస్టర్ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) విమర్శించారు. అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి... మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పిన జగన్ (CM Jagan) నుంచి ఇలాంటి పాలన ఊహించలేదన్నారు. రాష్ట్రానికి అప్పులు తప్ప ఆదాయం లేదని.. ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో శనివారం (నవంబర్ 27) ఉండవల్లి మీడియాతో మాట్లాడారు.
సీఎంగా ప్రమాణస్వీకార సమయంలో అవినీతిరహిత ప్రభుత్వం అందిస్తానని చెప్పిన సీఎం జగన్.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయారని ఉండవల్లి (Undavalli Arun Kumar) విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి లేదంటే చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం అవినీతిని ఏం కంట్రోల్ చేస్తున్నట్లని ప్రశ్నించారు. ఇసుక, పెట్రోల్, మద్యం, కరెంట్.. ఇలా అన్నింటిపై ప్రభుత్వం ధరలు పెంచేసిందని మండిపడ్డారు. అప్పులతోనే ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చి ఆపై రాష్ట్రాన్ని రోడ్డున పడేయడమే వైసీపీ (YSRCP) ఉద్దేశమన్నారు.
అప్పుల మీద అప్పులు చేస్తూ కొత్త అప్పుల కోసం ఎఫ్ఆర్బీఎమ్ చట్టాన్ని సవరించడం దుర్మార్గమని ఉండవల్లి ఫైర్ అయ్యారు. పోలవరం పూర్తయితే రాష్ట్ర (Andhra Pradesh) విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవచ్చునని భావించామన్నారు. కానీ కేంద్రం దానికి నిధులు ఇవ్వట్లేదని... కేసుల భయంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగట్లేదని అన్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుని... దాని స్థానంలో మెరుగైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ చెప్పడం ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టిందన్నారు. సీఎం సొంతంగా తయారుచేసిన చట్టాన్నే మళ్లీ మార్చే పరిస్థితి వచ్చిందన్నారు.
Also Read: Omricon: కరోనా కొత్త వేరియంట్ 'ఒమ్రికాన్'-బోత్సువానాలో మొదలై బెల్జియం వరకు
ఇక ఇటీవలి అసెంబ్లీ పరిణామాలపై స్పందిస్తూ... చంద్రబాబును ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెల గురించి ఎప్పుడూ, ఎక్కడా ఎలాంటి గాసిప్స్, స్కాండల్స్ వినలేదన్నారు. కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు (Chandrababu Naidu) కూడా అంతగా బాధపడాల్సిన పనిలేదన్నారు. అయితే ప్రెస్ మీట్లో ఆయన ఏడవడం డ్రామా అని తాను అనుకోవట్లేదన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయడాన్ని ఉండవల్లి తప్పు పట్టారు. అసలు సమస్యలను వదిలేసి వేరే ఇష్యూను తెర పైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook