Omicron Variant Alert: ఒమిక్రాన్ సోకితే..ప్రాణాలకు పెనుముప్పే, తస్మాత్ జాగ్రత్త

Omicron Variant Alert: ప్రపంచవ్యాపంగా ఆందోళన కల్గిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒమిక్రాన్ సోకితే ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2021, 09:47 AM IST
  • ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతపై హెచ్చరికలు జారీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • ఒమిక్రాన్ వేరియంట్ సోకితే ప్రజలు ప్రాణాలకు పెను ముప్పు తప్పదంటున్న వైద్య నిపుణులు
  • ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న ప్రభుత్వం
 Omicron Variant Alert: ఒమిక్రాన్ సోకితే..ప్రాణాలకు పెనుముప్పే, తస్మాత్ జాగ్రత్త

Omicron Variant Alert: ప్రపంచవ్యాపంగా ఆందోళన కల్గిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒమిక్రాన్ సోకితే ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నాయి.

కరోనా మహమ్మారి ఇప్పుడు రూపం మార్చుకుంది. ఏకంగా 30 మ్యూటేషన్లతో ప్రపంచంపై దాడి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే యూరప్ సహా 16 దేశాలకు విస్తరించింది. ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణ నేపధ్యంలో ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల్ని తప్పనిరి చేశాయి. స్పైక్ ప్రోటీన్‌లో 30 రకాల మ్యూటేషన్లు ఉన్నాయని గుర్తించిన శాస్త్రవేత్తలు..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) ఇండియాలో ప్రవేశించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఒమిక్రాన్ సోకితే ప్రజల ప్రాణాలకు పెనుముప్పు తప్పదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాయి. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. వివిధ జిల్లాల్లోని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం(Central government) సూచించింది. ప్రజలంతా భౌతిదూరం పాటిస్తూ..వ్యాక్సిన్ రెండు డోసుల్ని వేసుకోవాలంటోంది. దక్షిణాఫ్రికా, ఐరోపా, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, మార్షియస్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయిల్ వంటి దేశాల్నించి వచ్చే ప్రయాణీకులు వైరస్ లక్షణాలు లేకపోయినా ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు పరీక్షా కేంద్రాల్ని పెంచాల్సి ఉంది. తమిళనాడులో ఇప్పటికే 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.శరీరంలోని రోగనిరోధకశక్తిని(Immunity Power)దెబ్బతీసి..వేగంగా వ్యాప్తి చెందనుండటంతో ఒమిక్రాన్ వేరియంట్‌పై చాలా అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Also read: Vaccine on Omicron: ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త వ్యాక్సిన్, 45 రోజుల్లో మార్కెట్‌లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News